Koratala Siva : ఆచార్య‌తో కొర‌టాల‌కు తీవ్ర‌మైన ఆర్థిక స‌మ‌స్య‌లు..? ప్రాప‌ర్టీని అమ్మేశార‌ట‌..?

July 7, 2022 10:53 PM

Koratala Siva : సినిమా ఇండ‌స్ట్రీ అంటే.. అంతే.. అందులో ఏ విభాగంలో అయినా ఉండ‌వ‌చ్చు. కానీ నిర్మాణ రంగం వైపుకు మాత్రం వెళ్ల‌కూడ‌దు. ఎందుకంటే ఇత‌ర విభాగాల్లో వ‌చ్చిన అనుభ‌వంతో నిర్మాణ రంగం అంటే ఏమిటో అప్ప‌టికే తెలిసి వస్తుంది. క‌నుక వేరే విభాగాల్లో ఉన్న‌వారు ఎవ‌రూ కూడా సినిమాను నిర్మించేందుకు అంత‌గా ఆస‌క్తిని చూపించ‌రు. సినిమా రంగంలోని త‌మ విభాగంలోని ప‌నిని తాము చేసుకుపోతుంటారు. ఎవ‌రో పేరుగాంచిన హీరోలు అయితే త‌ప్ప స‌హ‌జంగా ఎవ‌రూ నిర్మాత‌గా మార‌రు. కానీ ఆ ద‌ర్శ‌కుడు మాత్రం నిర్మాత‌గా మారి త‌ప్పు చేశారని తెలుస్తోంది. ఇంత‌కీ ఆయ‌న ఎవ‌రో తెలుసా ? కొర‌టాల శివ‌. అవును.. ఈయ‌నే.. ఇంత‌కీ ఈయ‌న ఏం సినిమా చేశారు.. అనే క‌దా మీ డౌట్‌. అయితే అందుకు స‌మాధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ల‌తో క‌లిసి కొర‌టాల శివ ఆచార్య మూవీ చేశారు క‌దా. అవును.. దీనికే ఆయ‌న నిర్మాత‌గా కూడా ఉన్నారు. అవును.. ఇది నిజ‌మే. ఆచార్య సినిమాను మొద‌ట మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మించేందుకు పూనుకుంది. కానీ సినిమా చాలా ఆల‌స్యం అవుతుండ‌డం, బ‌డ్జెట్ పెరిగిపోతుండ‌డంతో వారు న‌ష్టం వ‌స్తుంద‌ని అంచ‌నా వేసి ముందుగానే సినిమా నుంచి త‌ప్పుకున్నారు. అయితే తాను ఇప్ప‌టి వ‌ర‌కు తీసిన సినిమాలు ఒక్క‌టి కూడా ఫ్లాప్ కాలేదు. అదే న‌మ్మ‌కంతో కొర‌టాల శివ ఆచార్య‌కు నిర్మాత‌గా ఉన్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు డ‌బ్బును సెటిల్ చేసి ఈ మూవీలో ఆయ‌న కొంత వాటా తీసుకున్నారు. అయితే అదే ఆయ‌న కొంప ముంచింది. ఎందుకంటే ఆచార్య ఫ్లాప్ అయింది.

Koratala Siva reportedly sold his property to clear Acharya debts
Koratala Siva

అలా ఆచార్య మూవీ ఫ్లాప్ కావ‌డంతో కొర‌టాల‌కు తీవ్రంగా న‌ష్టం వ‌చ్చింద‌ట‌. క‌నుక‌నే ఆయన డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు డ‌బ్బును సెటిల్ చేశారు. అయితే మొత్తం సెటిల్ చేసేందుకు ఇంకా రూ.15 కోట్లు చెల్లించాల్సి ఉండ‌డంతో గ‌త్యంత‌రం లేక కొర‌టాల త‌న ప్రాప‌ర్టీల్లో ఒక‌దాన్ని అమ్మేశార‌ట‌. అలా కొర‌టాల‌కు కూడా ఆచార్య తీవ్ర‌మైన న‌ష్టాన్నే మిగిల్చింది. అయితే ఇప్పుడు ఎన్‌టీఆర్ 30వ సినిమాతో ఆయ‌న ధీమాగా ఉన్నారు. క‌నీసం ఈ మూవీ అయినా హిట్ అయి లాభాల‌ను తెచ్చి పెడితే అప్పుడు పోయిన డ‌బ్బులు తిరిగి వ‌స్తాయ‌ని ఈయ‌న న‌మ్మ‌కం. మ‌రి కొర‌టాల ఆర్థిక క‌ష్టాల నుంచి గ‌ట్టెక్కుతారా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now