Currency Notes : మీ ద‌గ్గ‌ర ఈ నోట్లు, కాయిన్స్ ఉంటే.. అమ్మి డ‌బ్బు సంపాదించ‌వ‌చ్చు..!

July 7, 2022 12:13 PM

Currency Notes : సాధార‌ణంగా మ‌న వ‌ద్ద‌కు అప్పుడ‌ప్పుడు కొన్ని ప్ర‌త్యేక‌మైన నాణేలు, నోట్లు వ‌స్తుంటాయి. వాటిని చూసి మ‌నం ఆశ్చ‌ర్య‌పోతుంటాం. అయితే వాటిని ఆన్‌లైన్‌లో విక్ర‌యించాల‌నే కానీ ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. అలాంటి కాయిన్స్‌, క‌రెన్సీ నోట్ల‌ను విక్ర‌యించే సైట్లు చాలానే ఉన్నాయి. వాటిల్లో రిజిస్ట‌ర్ చేసుకోవ‌డం ద్వారా అలాంటి నాణేలు, నోట్ల‌ను మ‌నం సుల‌భంగా విక్ర‌యించి సొమ్ము చేసుకోవ‌చ్చు. ఇక అలాంటి నోట్ల‌లో 786 అనే నంబ‌ర్ ఉన్న నోట్లు ఒక‌టి. ఈ నంబ‌ర్‌ను ముస్లింలు ఎంతో ప‌విత్రంగా భావిస్తారు. ఈ నంబ‌ర్ ఉన్న నోట్లు త‌మ వ‌ద్ద ఉంటే అదృష్టం క‌ల‌సి వ‌స్తుంద‌ని.. అనుకున్న‌వి నెర‌వేరుతాయ‌ని.. ధ‌న‌వంతులు అవుతార‌ని విశ్వ‌సిస్తారు. క‌నుక‌నే ఈ నంబ‌ర్ ఉండే నోట్ల‌ను చాలా మంది కొంటుంటారు. ఇక ఇలాంటి నోట్లు మీ ద‌గ్గ‌ర కూడా ఉంటే అమ్మి సొమ్ము చేసుకోవ‌చ్చు.

786 అనే నంబ‌ర్‌లో ఉండే నోట్ల‌ను విక్ర‌యించాలంటే అందుకు ఈబే అనే సైట్‌ను సంద‌ర్శించాలి. అందులో రిజిస్ట‌ర్ అయ్యాక లాగిన్ అవ్వాలి. మీ ద‌గ్గ‌ర ఉండే నోట్ల‌కు చెందిన ఫొటోల‌ను తీసి అందులో యాడ్ పెట్టాలి. అప్పుడు కావ‌ల్సిన వారు ఆ నోట్ల‌ను కొంటారు. మీకు డ‌బ్బు చెల్లిస్తారు. ఇలా ఈ నోట్ల‌ను అమ్మ‌వ‌చ్చు.

if you have these Currency Notes and coins you can get money
Currency Notes

 

ఇక మాతా వైష్ణోదేవికి ఫొటోతో కూడిన నాణేల‌ను 2002లో అప్ప‌టి కేంద్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. ఇవి చాలా అరుదైన కాయిన్స్. వీటిని అధిక ధ‌ర‌ల‌కు చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. ఈ నాణేల‌ను పెట్టుకుంటే ల‌క్ష్మీదేవి అనుగ్ర‌హిస్తుంద‌ని.. ధ‌నం బాగా సంపాదించ‌వ‌చ్చ‌ని న‌మ్ముతారు. క‌నుక‌నే ఈ నాణేల‌ను కూడా చాలా మంది కొంటున్నారు. ఇక ఈ నాణేలు మీ ద‌గ్గ‌ర ఉంటే కాయిన్ బ‌జార్ అనే సైట్‌లో వీటిని విక్ర‌యించి డ‌బ్బులు పొంద‌వ‌చ్చు. ఇలా మీ ద‌గ్గ‌ర ఉండే ప్ర‌త్యేక నాణేలు, నోట్ల‌తోపాటు పాత కాయిన్స్ ను, నోట్ల‌ను కూడా ఆయా సైట్ల‌లో విక్ర‌యించి డ‌బ్బులు సంపాదించ‌వచ్చు. అయితే వీటిని అమ్మేట‌ప్పుడు మోస‌పోకుండా జాగ్ర‌త్త‌లు పాటించండి. లేదంటే సైబ‌ర్ నేర‌గాళ్ల బారిన ప‌డ‌తారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now