Krithi Shetty : త‌న మన‌సులో ఉన్న కోరిక‌ను బ‌య‌ట పెట్టేసిన కృతిశెట్టి.. తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

July 6, 2022 4:45 PM

Krithi Shetty : ఉప్పెన చిత్రం ద్వారా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది.. కృతి శెట్టి. ఈ మూవీ షూటింగ్ స‌మ‌యంలోనే ఈమెకు ఆఫ‌ర్లు వెల్లువ‌లా వ‌చ్చాయి. దీంతో ఉప్పెన త‌రువాత వెంట వెంట‌నే శ్యామ్ సింగ‌రాయ్‌, బంగార్రాజు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. ఇవి హిట్ అవ‌డంతో ఈ అమ్మ‌డు జోరు పెంచింది. ఈమెకు ఆఫ‌ర్లు కూడా అలాగే వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే కృతి శెట్టి న‌టించిన ది వారియ‌ర్ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా జూలై 15వ తేదీన రిలీజ్ కానుంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం కృతి శెట్టి ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటోంది. ఇందులో ఈమె రామ్‌కు జోడీగా యాక్ట్ చేసింది.

ఎన్‌.లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో న‌టుడు ఆది పినిశెట్టి విల‌న్ రోల్‌లో న‌టించారు. రామ్ ఇందులో ప‌వర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. ఈ క్ర‌మంలోనే తాజాగా రిలీజ్ అయిన ది వారియ‌ర్ ట్రైల‌ర్ అంద‌రిలోనూ ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఇక సినిమా విడుద‌ల కానుండ‌డంతో కృతి శెట్టి ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటూ ప‌లు మీడియా సంస్థ‌ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తోంది. అందులో భాగంగానే ఆమె త‌న సినిమా కెరీర్‌కు సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించింది.

Krithi Shetty told about her wish acting with Ram Charan and Mahesh Babu
Krithi Shetty

కాగా ది వారియ‌ర్ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న కృతి శెట్టి మాట్లాడుతూ త‌న‌కు రామ్ చ‌ర‌ణ్, మ‌హేష్ బాబు అంటే ఎంతో ఇష్ట‌మ‌ని చెప్పింది. వారితో న‌టించేందుకు తాను ఎంతో ఆస‌క్తిగా ఉన్నాన‌ని తెలియ‌జేసింది. వారితో న‌టించాల‌న్న‌ది త‌న కోరిక అని అస‌లు విష‌యాన్ని చెప్పేసింది. రామ్ చ‌ర‌ణ్ చాలా క్యూట్‌గా ఉంటాడ‌ని, మ‌హేష్ అయితే హ్యాండ్స‌మ్ హీరో అని చెప్పింది. అయితే వీరితో క‌ల‌సి న‌టించే అవ‌కాశం కోసం ఎదురు చూస్తున్నాన‌ని కృతి శెట్టి తెలియ‌జేసింది.

ఇక కృతి శెట్టి ఇదే కాకుండా సూర్య‌తో క‌ల‌సి ఓ సినిమాలోనూ న‌టిస్తోంది. దీంతోపాటు నాగ‌చైత‌న్య‌తో మ‌రో మూవీలో ఈమె సంద‌డి చేయ‌నుంది. అలాగే సుధీర్‌, నితిన్‌ల‌తోనూ ఈమె సినిమాలు చేస్తోంది. ఇలా కృతిశెట్టి వ‌రుస సినిమాల‌తో ఎంతో బిజీగా ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment