Shruti Haasan : శృతి హాస‌న్ కండిష‌న్ సీరియ‌స్‌..? అస‌లు మ్యాట‌ర్ ఏంటి..?

July 6, 2022 2:36 PM

Shruti Haasan : సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య కాలంలో అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వాటిల్లో సెల‌బ్రిటీల‌కు సంబంధించిన‌వే ఎక్కువ‌గా ఉంటున్నాయి. ఈ క్ర‌మంలోనే రోజుకో వార్త సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ఇక తాజాగా శృతి హాస‌న్‌కు చెందిన ఒక వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. శృతి హాస‌న్ కండిష‌న్ చాలా సీరియ‌స్‌గా ఉంద‌ని.. ఆమె హాస్పిట‌ల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతుంద‌ని.. వార్త‌లు వ‌చ్చాయి. అయితే వాటిపై శృతి హాస‌న్ స్పందించింది. ఒక వీడియో మెసేజ్ ద్వారా ఆ వార్త‌ల‌ను ఖండించింది. ఇంత‌కీ ఆమె ఏం చెప్పిందంటే..

సోష‌ల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్త‌ల్లో ఎంత మాత్రం నిజం లేద‌ని శృతి హాస‌న్ కొట్టి పారేసింది. అవ‌న్నీ పుకార్లేన‌ని వాటిని న‌మ్మ‌వ‌ద్ద‌ని చెప్పింది. త‌న‌కు ఏమీ కాలేద‌ని.. నిక్షేపంగా ఉన్నాన‌ని.. కండిష‌న్ సీరియ‌స్ అని.. ఐసీయూలో ఉన్నాన‌ని వ‌స్తున్న వార్త‌ల‌ను న‌మ్మొద్ద‌ని ఆమె కోరింది. కొంద‌రు కావాల‌నే త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అయితే త‌న‌కు పీసీవోఎస్ స‌మ‌స్య చాలా కాలంగా ఉంద‌ని.. అంతేకానీ త‌న ఆరోగ్యం మాత్రం క్షీణించ‌లేద‌ని.. మ‌రోమారు స్ప‌ష్టం చేసింది.

Shruti Haasan given clarity on her health issues
Shruti Haasan

ఇక శృతి హాస‌న్ ఈమ‌ధ్యే క‌రోనా బారిన ప‌డింది. ఆ త‌రువాత కోలుకుంది. కానీ కోవిడ్ నుంచి కోలుకున్న త‌రువాత ఈమె షాకింగ్ లుక్‌లో క‌నిపించింది. దీంతో ఈమె ఆరోగ్యం నిజంగానే క్షీణించింద‌ని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని ఆమెనే స్వ‌యంగా చెప్పేసింది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. శృతి ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న స‌లార్‌లో న‌టిస్తుండ‌గా.. మ‌రోవైపు గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తున్న బాల‌య్య సినిమాలోనూ ఈమె న‌టిస్తోంది. దీంతోపాటు చిరంజీవి సినిమాలోనూ ఈమె క‌న్‌ఫామ్ అయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now