Pavitra Lokesh : ప‌విత్రా లోకేష్‌కు ఊహించ‌ని షాక్‌..? దిమ్మ తిరిగిపోయింది..?

July 6, 2022 11:34 AM

Pavitra Lokesh : ఈ మ‌ధ్య కాలంలో నటి ప‌విత్రా లోకేష్ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నారు. ఈమెకు, సీనియ‌ర్ న‌టుడు న‌రేష్‌కు మ‌ధ్య ఉన్న బంధం గురించి బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసిపోయింది. ఈ క్ర‌మంలోనే గత వారం రోజులుగా ప‌లు నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప‌విత్ర‌, న‌రేష్‌లు ఇద్ద‌రూ మైసూర్‌లోని ఒక హోట‌ల్‌లో న‌రేష్ భార్య ర‌మ్య‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డారు. త‌రువాత అక్క‌డ ర‌మ్య ప‌విత్ర‌ను చెప్పుతో కొట్ట‌బోగా.. పోలీసులు వారించి పంపించేశారు. అయితే ఆ త‌రువాత కూడా వీరు అనేక సంద‌ర్భాల్లో ప‌ర‌స్ప‌రం ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ వ‌స్తున్నారు. ఇక తాజాగా న‌టి పూజిత న‌రేష్ గురించి ఆసక్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు.

న‌రేష్ చాలా మంచి వ్య‌క్తి అని.. ఆయ‌న భార్య ర‌మ్య‌కు ఏదైనా స‌మస్య ఉంటే హైద‌రాబాద్‌లో తేల్చుకోవాల‌ని కానీ బెంగ‌ళూరుకు వెళ్ల‌డ‌మేమిట‌ని ప్ర‌శ్నించారు. అలాగే పవిత్ర లోకేష్ భ‌ర్త సుచేంద్ర ప్ర‌సాద్ కూడా ఆమెకు చాలా మందితో సంబంధాలు ఉన్నాయ‌ని.. ఆమె ఎల్ల‌ప్పుడూ ల‌గ్జ‌రీని కోరుకుంటుంద‌ని.. తాను ఎక్కువ ఆస్తిని సంపాదించ‌లేదు క‌నుక ఆమె ఇత‌ర వ్య‌క్తుల‌కు ద‌గ్గ‌ర అయింద‌ని ఆరోప‌ణ‌లు చేశారు. అయితే న‌రేష్ క‌న్నా వాస్త‌వానికి ప‌విత్ర లోకేష్ ప‌రువే ఎక్కువ‌గా పోయింద‌ని చెప్ప‌వ‌చ్చు. ఇది చాల‌ద‌న్న‌ట్లు ఆమెకు మ‌రో ఊహించ‌ని షాక్ తగిలిన‌ట్లు తెలుస్తోంది.

Pavitra Lokesh reportedly removed in two movies
Pavitra Lokesh

ప‌విత్ర లోకేష్ ఇప్ప‌టికే ప‌లు సినిమాల్లో న‌టించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమె క‌ట్టు బొట్టు చూసి అచ్చ‌మైన మాతృమూర్తి అంటే ఈమెనేనా అన్న‌ట్లు ప్రేక్ష‌కులు ఆమెను చాలా గొప్ప‌గా ఊహించుకున్నారు. కానీ తాజాగా సంఘ‌ట‌న‌ల‌తో ఆమె త‌న ప‌రువు మొత్తాన్ని పోగొట్టుకుంది. దీంతో ఆమె సినిమాల్లో న‌టిస్తే ఆ ప్ర‌భావం సినిమాల‌పై ప‌డుతుంద‌ని చెప్పి ఆమె న‌టిస్తున్న రెండు సినిమాల నుంచి మేక‌ర్స్ ఆమెను తొల‌గించిన‌ట్లు తెలుస్తోంది. ఆమెను వ‌ద్ద‌ని చెప్పేశార‌ట‌. ఈ క్ర‌మంలోనే ఆమెకు ముందు ముందు ఇక ఆఫ‌ర్లు ద‌క్కే ప‌రిస్థితి కూడా ఉండ‌ద‌ని అంటున్నారు. మ‌రి రానున్న రోజుల్లో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now