Pragathi : జిమ్‌లో న‌టి ప్ర‌గ‌తి హ‌ల్‌చ‌ల్‌.. చాలా క‌ష్ట‌మైన వ‌ర్క‌వుట్లు చేస్తోంది.. వీడియో..!

July 5, 2022 5:30 PM

Pragathi : సీనియ‌ర్ న‌టి ప్ర‌గ‌తి ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఈ మ‌ధ్యే ఆమె త‌న బ‌ర్త్ డే వేడుక‌ల‌ను జ‌రుపుకోగా.. అందులో ఆమె గ్లామ‌ర‌స్ డ్రెస్‌తో క‌నువిందు చేసింది. దీంతో ఈ వ‌య‌స్సులో మీకు బ‌ర్త్ డేలు అవ‌స‌ర‌మా.. ఇలాంటి దుస్తులు ఎందుకు ధ‌రించాలి.. బ‌ర్త్ డేలు ఎందుకు చేసుకోవాలి.. అంటూ చాలా మంది ఆమెను విమర్శించారు. అయితే ఆ విమ‌ర్శ‌ల‌ను మాత్రం ఈమె ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇక ఈమె పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర‌లో ఎఫ్3 మూవీలో ఈ మ‌ధ్యే న‌టించ‌గా.. ఆ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజయం సాధించింది. అందులో భాగంగానే ఆమె స‌క్సెస్ మీట్‌లో మాట్లాడుతూ భావోద్వేగానికి గురైంది.

తాను చాలా సినిమాల్లో అనేక పాత్ర‌ల్లో న‌టించాన‌ని.. అయితే ఎఫ్3 మూవీలో న‌టించిన పాత్ర త‌న‌కు ఎంతో తృప్తినిచ్చిందని.. మ‌ళ్లీ అలాంటి క్యారెక్ట‌ర్ ల‌భిస్తుందో లేదోన‌ని తెలియ‌జేసింది. ఎఫ్3 మూవీలో తాను భిన్న‌మైన పాత్ర‌లో న‌టించాన‌ని.. త‌న‌కు చాన్స్ ఇచ్చినందుకు ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడికి ఆమె కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది. ఇక ప్ర‌గ‌తి సోష‌ల్ మీడియాలోనూ ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అందులో ఆమె అనేక పోస్టుల‌ను పెడుతూ ఉంటుంది.

Pragathi workout in gym video viral
Pragathi

సోష‌ల్ మీడియాలో ప్ర‌గ‌తి చేసే ర‌చ్చ మామూలుగా ఉండ‌దు. అందులో ఆమె ప‌లు పాట‌ల‌కు డ్యాన్స్‌లు చేస్తూ ఆ వీడియోల‌ను పోస్ట్ చేస్తుంటుంది. దీంతో అవి వైర‌ల్ అవుతుంటాయి. ఇక ఆమె తాను జిమ్‌లో చేసే వ‌ర్క‌వుట్ల‌కు చెందిన వీడియోల‌ను కూడా పెడుతుంటుంది. ఈ క్ర‌మంలోనే ఆమె తాజాగా అలాంటిదే మ‌రో వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె జిమ్‌లో తెగ క‌ష్ట‌ప‌డుతుండ‌డాన్ని చూడ‌వచ్చు. ఈ క్ర‌మంలోనే ఈ వీడియో కూడా వైర‌ల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Pragathi Mahavadi (@pragstrong)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now