Anasuya : అన‌సూయ‌ను పొగ‌డ్త‌ల్లో ముంచెత్తిన అదిరే అభి.. మురిసిపోతున్న అన‌సూయ‌..

July 5, 2022 9:54 AM

Anasuya : తెలుగు బుల్లితెర‌, వెండితెర ప్రేక్ష‌కుల‌కు అనసూయ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ఓ వైపు బుల్లితెర‌పై టీవీ షోల‌లో అద‌ర‌గొడుతూనే మ‌రోవైపు సినిమాల్లో న‌టిస్తూ అల‌రిస్తోంది. ఈ మ‌ధ్య కాలంలో అన‌సూయ న‌టించిన అనేక చిత్రాలు వ‌రుస‌గా విడుద‌ల‌య్యాయి. అప్ప‌ట్లో ఈమె న‌టించిన రంగ‌స్థ‌లం చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో అంద‌రికీ తెలిసిందే. అందులో రంగ‌మ్మ‌త్త‌గా ఈమె యాక్టింగ్ అద్భుతంగా చేసింది. అలాగే మొన్నీ మ‌ధ్య వ‌చ్చిన పుష్ప‌లో దాక్షాయ‌ణి పాత్ర‌లో నెగెటివ్ రోల్‌లో క‌నిపించి అద‌ర‌గొట్టేసింది. ఇలా అన‌సూయ బుల్లితెర‌తోపాటు వెండితెర‌పై కూడా దూసుకుపోతోంది.

అయితే అన‌సూయ‌పై ఓ కార్య‌క్ర‌మంలో భాగంగా అదిరే అభి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశాడు. ఈ సంద‌ర్భంగా అభి మాట్లాడుతూ.. అను, నిన్ను కెరీర్ బిగినింగ్ నుంచి చూస్తున్నా. న్యూస్ రీడ‌ర్గా చేశావు, యాంక‌ర్‌గా చేశావు, ఇప్పుడు న‌టి అయ్యావు. పెద్ద పెద్ద స్టార్స్ సినిమాల్లో న‌టిస్తున్నావు. నీ ఎదుగులకు నువ్వే కార‌ణం. నీకు ఎవ‌రూ భిక్ష‌పెట్టలేదు. నువ్వు క‌ష్ట‌ప‌డి పైకి వ‌చ్చావు. పుష్ప హిట్ అయ్యాక నీకు హిందీలోనూ పేరు వ‌చ్చింది. ఇక త‌గ్గేదేలే. నువ్వు ఇంకా మంచి సినిమాలు చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి.. అంటూ అభి అనసూయ‌ను పొగ‌డ్త‌ల్లో ముంచెత్తాడు.

Adire Abhi praised Anasuya she is very happy
Anasuya

కాగా త‌న‌పై అభి చేసిన కామెంట్స్‌కు అన‌సూయ మురిసిపోయింది. ఆమె సంతోషంగా అభికి థాంక్స్ చెబుతూ ల‌వ్ ఎమోజీల‌తో కూడిన పోస్ట్‌ను పెట్టింది. అయితే అన‌సూయ రీసెంట్‌గా జ‌బ‌ర్ద‌స్త్‌కు గుడ్ బై చెప్పేసింది. త‌న కెరీర్‌లో తాను ఒక కీల‌క‌మైన నిర్ణ‌యాన్ని తీసుకున్నాన‌ని.. ఇక‌పై కూడా ప్రేక్ష‌కులు త‌న‌కు మ‌ద్ద‌తుగా ఉంటార‌ని కోరుకుంటున్నాన‌ని.. అన‌సూయ పోస్ట్ పెట్టింది. అయితే ఆమె జ‌బ‌ర్ద‌స్త్‌ను వీడేందుకు కార‌ణం సినిమాలే అని తెలుస్తోంది. సినిమాల్లో చాన్స్‌లు బాగా వ‌స్తున్నందునే టీవీ షోల‌కు గుడ్ బై చెబుతుంద‌ని స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now