Sai Rajesh : ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ లేజీ ఫెలోస్.. చాలా బ‌ద్ద‌క‌స్తుల‌న్న ద‌ర్శ‌కుడు..

July 4, 2022 5:09 PM

Sai Rajesh : ప‌వర్ స్టార్ ప‌వ‌న్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎంత ప్ర‌త్యేక‌మో వేరే చెప్పాల్సిన ప‌నిలేదు. ప‌వ‌న్ చేసే ఏ ప‌నికి అయినా స‌రే ఫ్యాన్స్ స‌పోర్ట్ వీర లెవ‌ల్‌లో ఉంటుంది. ప‌వ‌న్ అనే కాదు.. ఏ హీరో ఫ్యాన్స్ అయినా స‌రే అలాగే ఉంటారు. అయితే ప‌వ‌న్‌కు ఒక రాజ‌కీయ పార్టీ కూడా ఉంది. కానీ ఇత‌ర హీరోల‌కు లేదు. అయితే ఈ విష‌యంలోనే ఓ ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ ఫ్యాన్స్‌పై కామెంట్స్ చేశారు. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఆయ‌న‌ను భారీగా విమ‌ర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు చెందిన సినిమాలు వ‌స్తే ఆయ‌న ఫ్యాన్స్ నానా హంగామా చేస్తారు. కానీ ఆయన పార్టీ అయిన జ‌న‌సేన కోసం ఏదైనా పిలుపునిస్తే వ‌ప‌న్ ఫ్యాన్స్ ఎందుకు స్పందించరు ? ఈ విష‌యంలో వారు ఎందుకు అంత లేజీగా.. బ‌ద్ద‌కంగా ఉంటారు.. అని ద‌ర్శ‌కుడు సాయి రాజేష్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ చేసిన ఆయ‌న కొద్ది సేప‌టి త‌రువాత వెంట‌నే తాను పొర‌పాటున ట్వీట్ చేశాని.. ఈ విష‌యాన్ని ఇంత‌టితో వ‌దిలేయాల‌ని అన్నారు. కానీ అప్ప‌టికే ఆయ‌న ట్వీట్ వైర‌ల్‌గా మారింది. దీంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ ఊరుకోవ‌డం లేదు. ఆయ‌న‌ను దారుణంగా విమ‌ర్శిస్తున్నారు.

Sai Rajesh says Pawan Kalyan fans are lazy fellows
Sai Rajesh

కాగా సాయి రాజేష్ వాస్త‌వానికి మెగా హీరోలు అంద‌రికీ పెద్ద ఫ్యాన్. ఆయ‌న చిన్న సినిమాల‌కు ద‌ర్శ‌కుడు అన్న మాటే కానీ.. ఎంతో మంచి గుర్తింపు పొందాడు. ముఖ్యంగా సంపూర్ణేష్ బాబుకు చెందిన సినిమాల‌ను తీసి ఆయ‌న ఫేమ‌స్ అయ్యారు. అయితే ఉన్న‌ట్లుండి సాయి రాజేష్ ఇలా ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను ఎందుకు కెలికార‌న్న‌ది అంతుబ‌ట్టడం లేదు. కానీ ఆయ‌న‌ను మాత్రం ప‌వ‌న్ ఫ్యాన్స్ బూతులు తిడుతున్నారు. మ‌రి చీమ‌ల పుట్ట‌ను క‌దిపితే అవి ఊరుకుంటాయా.. కుట్టే దాకా విడిచిపెట్ట‌వు. ఇక ఫ్యాన్స్ ఫైర్ ఎప్పుడు చ‌ల్లారుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now