Sudigali Sudheer : వామ్మో.. సుడిగాలి సుధీర్ రెమ్యున‌రేష‌న్ అంత‌నా.. క‌ళ్లు బైర్లు క‌మ్ముతాయి..!

July 1, 2022 3:28 PM

Sudigali Sudheer : తెలుగు టీవీ ప్రేక్ష‌కుల‌కు సుడిగాలి సుధీర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. సుధీర్ ఎప్ప‌టి నుంచో జ‌బ‌ర్ద‌స్త్ వేదిక‌పై క‌మెడియ‌న్‌గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. దీంతో సినిమాల్లోనూ చాన్స్‌లు వ‌స్తున్నాయి. ఇక ప‌లు ఇత‌ర షోల‌లోనూ సుధీర్ సంద‌డి చేస్తున్నాడు. జ‌బ‌ర్ద‌స్త్ పేరు చెప్ప‌గానే మ‌నకు ముందుగా గుర్తుకు వ‌చ్చే పేర్ల‌లో సుధీర్ పేరు ఒక‌టి. అయితే జ‌బ‌ర్ద‌స్త్‌లో ప్ర‌స్తుతం సుధీర్ క‌నిపించ‌డం లేదు. అక్క‌డ ప‌లు కార‌ణాల వ‌ల్ల షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. దీంతో ఇత‌ర షోలు చేస్తున్నాడు.

సుధీర్ చేసిన చాలా షోల‌కు మంచి రేటింగ్స్ వ‌చ్చాయి. జ‌బ‌ర్ద‌స్త్ తోపాటు శ్రీ‌దేవి డ్రామా కంపెనీ, ఢీ షోల‌కు సుధీర్ వ‌ల్లే రేటింగ్స్ పెరిగాయ‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. అయితే జ‌బ‌ర్ద‌స్త్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక శ్రీ‌దేవి డ్రామా కంపెనీలో ప‌లు ఎపిసోడ్స్‌లోనూ సుధీర్ క‌నిపించాడు. కానీ అక్క‌డ కూడా మానేశాడు. ప్ర‌స్తుతం స్టార్ మాలో షోస్ చేస్తున్నాడు సుధీర్‌. ఇక స్టార్ మాలో పార్టీ లేదా పుష్ప‌కు యాంక‌ర్‌గా చేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఈ షోకు గాను సుధీర్ భారీగా రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

Sudigali Sudheer reportedly taking double remuneration
Sudigali Sudheer

జ‌బ‌ర్ద‌స్త్‌లో సుధీర్ ఒక ఎపిసోడ్‌కు రూ.3 ల‌క్ష‌ల నుంచి రూ.4 ల‌క్ష‌ల వ‌ర‌కు తీసుకునేవాడ‌ట‌. త‌రువాత శ్రీ‌దేవి డ్రామా కంపెనీలో, ఢీ షోలో రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.7 ల‌క్ష‌ల వ‌ర‌కు ఇచ్చార‌ట‌. అయితే ఆ షోల నుంచి త‌ప్పుకునేట‌ప్పుడు సుధీర్‌కు రూ.10 ల‌క్ష‌లు ఇస్తామ‌న్నార‌ట‌. కానీ స్టార్ మాలో ఇంకా అంత క‌న్నా ఎక్కువే ఆఫ‌ర్ చేశారు. దీంతో స్టార్ మాలో చేరిపోయాడు. ప్ర‌స్తుతం ఒక్క షెడ్యూల్‌కు సుధీర్‌కు స్టార్ మా వారు రూ.15 ల‌క్ష‌ల వ‌ర‌కు చెల్లిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే సుధీర్‌కు రెమ్యున‌రేష‌న్ డ‌బుల్ అయింద‌ని చెప్ప‌వ‌చ్చు. దీంతో ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now