Medha : న‌టుడు శ్రీ‌కాంత్ కుమార్తెను చూశారా ? చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది..!

July 1, 2022 8:19 AM

Medha : సీనియ‌ర్ న‌టుడు, హీరో శ్రీ‌కాంత్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న ఎన్నో చిత్రాల్లో న‌టించ‌గా.. అనేక సినిమాలు హిట్ అయ్యాయి. ఫ్యామిలీ హీరోగానే కాక‌, మాస్ హీరోగా కూడా శ్రీ‌కాంత్ ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆరంభంలో ఈయ‌న విల‌న్ పాత్ర‌ల్లో న‌టించారు. త‌రువాత హీరో అయ్యారు. అయితే ఇప్పుడు అవ‌కాశాలు త‌గ్గ‌డంతో ఈయ‌న మ‌ళ్లీ విల‌న్ పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. ఈ మ‌ధ్యే బాల‌య్య అఖండ మూవీలో శ్రీ‌కాంత్ విల‌న్‌గా న‌టించి ఆక‌ట్టుకున్నారు. ఇక శ్రీ‌కాంత్ భార్య ఊహ అన్న విష‌యం తెలిసిందే. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే వీరికి ముగ్గురు సంతానం క‌లిగారు. ఇద్ద‌రు కుమారులు రోష‌న్‌, రోహ‌న్ కాగా.. కుమార్తె మేధ‌ ఉన్నారు.

అయితే శ్రీ‌కాంత్ కుటుంబ సభ్యులు తాజాగా తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్నారు. ఈ క్ర‌మంలోనే తిరుమ‌ల మాడ వీధుల్లో ఊహ‌తోపాటు మేధ కూడా క‌నిపించింది. ఎరుపు రంగు సంప్ర‌దాయ దుస్తుల‌ను ధ‌రించి ఆమె అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. దీంతో ఆమెతో ఫొటోలు దిగేందుకు చాలా మంది ఆస‌క్తిని చూపించారు. ఇక సామాజిక మాధ్య‌మాల్లోనూ మేధ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి. అచ్చం త‌ల్లిలాగే ఎంతో అందంగా ఉంద‌ని ఆమెను కొనియాడుతున్నారు.

Srikanth daughter Medha visited Tirumala
Medha

కాగా శ్రీ‌కాంత్ కుమారుడు రోష‌న్ ఇప్ప‌టికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. రుద్ర‌మ‌దేవి సినిమాలో బాల‌న‌టుడిగా అల‌రించాడు. అలాగే నిర్మ‌ల కాన్వెంట్ అనే చిత్రంతోపాటు పెళ్లి సంద‌డి అనే మూవీలోనూ యాక్ట్ చేశాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ ప‌రిచిన‌ప్ప‌టికీ న‌ట‌న‌లో రోష‌న్ కు మంచి మార్కులే ప‌డ్డాయి. ఇక మేధ సినిమాల్లోకి వ‌స్తుందా.. రాదా.. అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయిన‌ప్ప‌టికీ ఆమె అందం చూస్తుంటే క‌చ్చితంగా సినిమాల్లోకి వ‌స్తుంద‌నే తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now