Sai Pallavi : నాగ‌చైత‌న్య‌తో ఉంటే.. ఏదో తెలియ‌ని ఫీలింగ్ క‌లుగుతుంది : సాయిప‌ల్ల‌వి

June 30, 2022 6:38 PM

Sai Pallavi : టాలీవుడ్‌లో మోస్ట్ క్యూట్ హీరోయిన్ల‌లో సాయి ప‌ల్ల‌వి ఒక‌రు. ఎలాంటి గ్లామ‌ర్ షో చేయ‌క‌పోయినా సాయిప‌ల్ల‌వికి అవ‌కాశాలు వ‌స్తూనే ఉన్నాయి. అంటే ఆమె టాలెంట్ ఏపాటిదో మ‌నం ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. ఈ మ‌ధ్యే ఆమె న‌టించిన విరాట ప‌ర్వం మూవీ రిలీజ్ అయింది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ ప‌రిచింది. అయిన‌ప్ప‌టికీ సాయిప‌ల్ల‌వి ఇందులో అద్భుతంగా న‌టించింద‌ని చెప్ప‌వ‌చ్చు. సినిమా మొత్తం ఆమె చుట్టే తిరుగుతుంది. ఇక సాయిప‌ల్ల‌వి ఈ మూవీ రిలీజ్‌కు ముందు అన‌వ‌స‌రంగా వివాదంలో చిక్కుకుని కొంద‌రు ఫ్యాన్స్‌ను దూరం చేసుకుంది. లేకపోతే విరాట‌ప‌ర్వంకు ఇంకా మంచి టాక్ వ‌చ్చి ఉండేది.

అయితే సాయిప‌ల్ల‌వి త‌న వ్య‌క్తిత్వం ప‌రంగా అందరినీ ఆక‌ట్టుకుంటుంది. ఆమెకు గ‌తంలో అనేక కంపెనీలు భారీ పారితోషికం ఇస్తామ‌ని, అందుకు యాడ్స్ చేయాల‌ని ఆమెకు ఆఫ‌ర్లను ఇచ్చాయి. కానీ ఆమె వాటిని తిర‌స్క‌రించింది. త‌న‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన అంద‌మే ముఖ్య‌మ‌ని క‌నుక బ్యూటీ మాత్ర‌మే కాదు, ఎలాంటి ప్రొడ‌క్ట్స్‌ను తాను ప్ర‌మోట్ చేయ‌లేన‌ని చెప్పింది. ఇక ఇటీవ‌లే మ‌రో కంపెనీ కూడా ఆమెకు భారీ మొత్తంలో ఇస్తామ‌ని చెప్పింది. అయిన‌ప్ప‌టికీ ఆమె ఆ ఆఫ‌ర్‌ను కూడా సున్నితంగా తిర‌స్క‌రించి త‌న వ్య‌క్తిత్వం ఎలాంటిదో మ‌రోమారు చాటుకుంది.

Sai Pallavi says Naga Chaitanya is very caring
Sai Pallavi

సాయిప‌ల్ల‌విని చాలా మంది డ్యాన్స్ మాత్ర‌మే కాక‌.. ఆమె క్యారెక్ట‌ర్ అంటే కూడా ఇష్ట‌ప‌డుతుంటారు. అందుక‌నే ఆమెకు ఫ్యాన్స్ భారీగా ఉన్నారు. ఇక ఈ మ‌ధ్యే ఆమె ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించింది. త‌న‌కు రానా, నాగ‌చైత‌న్య మంచి ఫ్రెండ్స్ అని చెప్పింది. అయితే రానా త‌న‌కు విరాట ప‌ర్వం షూటింగ్ స‌మ‌యంలో ఎంతో స‌హాయం చేశార‌ని.. ఇక చైత‌న్య అంటే ఇష్ట‌మ‌ని.. ఆయ‌న త‌న‌ను బాగా కేరింగ్‌గా చూసుకుంటార‌ని.. ఆయ‌న‌తో ఉంటే ఆయ‌న‌ది, త‌న‌ది ఒకే ఫ్యామిలీ అన్న ఫీలింగ్ క‌లుగుతుంద‌ని సాయిప‌ల్ల‌వి తెలియ‌జేసింది. దీంతో ఆమె కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now