Anasuya : డ్యాన్స్‌తో అన‌సూయ అరాచ‌కం.. మామూలుగా చేయ‌లేదు.. వీడియో..!

June 30, 2022 2:42 PM

Anasuya : రంగ‌స్థ‌లం సినిమాలో రంగ‌మ్మ‌త్త క్యారెక్ట‌ర్‌తో అన‌సూయ తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అంత‌కు ముందు ఈమె సినిమాల‌లో చేసినా ఈ మూవీనే ఆమెకు ఎక్కువ పేరు తెచ్చి పెట్టింది. ఈ క్ర‌మంలోనే అన‌సూయ అప్ప‌టి నుంచి వ‌రుస సినిమాల్లో ఆఫ‌ర్ల‌ను అందుకుంటూ త‌న స‌త్తా చాటుతూ వ‌స్తోంది. ఇక పుష్ప సినిమాలో అయితే దాక్షాయ‌ణి పాత్ర‌లో నెగెటివ్ షేడ్స్‌తో న‌టించి షాకిచ్చింది. అన‌సూయ పాత్ర నిడివి త‌క్కువే అయినా సినిమాలో కీల‌కంగా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే దాక్షాయ‌ణిగా అన‌సూయ చేసిన ర‌చ్చ మామూలుగా లేదు.

ఇక అన‌సూయ ఇటీవ‌లే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. త‌న కెరీర్‌లో తాను కీల‌క‌మైన నిర్ణ‌యం తీసుకున్నాన‌ని.. ఎన్నో జ్ఞాప‌కాల‌తో వెళ్తున్నాన‌ని.. బాధ‌గా ఉన్నా త‌ప్ప‌డం లేద‌ని.. ఇక‌పై కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాన‌ని తెలిపింది. దీంతో ఈమె జ‌బ‌ర్ద‌స్త్‌కు గుడ్ బై చెప్పింద‌ని.. క‌నుక‌నే ఆ పోస్ట్ పెట్టి ఉంటుందని అంటున్నారు. అయితే అన‌సూయ ఇటీవ‌లే ఓ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో మెరిసింది. అందులో డ్యాన్స్ చేసి అల‌రించింది.

Anasuya dance in party cheddam pushpa promo
Anasuya

స్టార్ మా చాన‌ల్‌లో ప్ర‌సారం అవుతున్న పార్టీ చేద్దాం పుష్ప షో లో అన‌సూయ పాల్గొని డ్యాన్స్ చేసింది. అందులో గ్లామ‌ర‌స్ డ్రెస్ ధ‌రించి అన‌సూయ చేసిన డ్యాన్స్‌కు యువ‌త ఫిదా అవుతున్నారు. ఆమె డ్యాన్స్ స్టెప్స్‌కు మైమ‌రిచిపోతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె డ్యాన్స్ తాలూకు వీడియో వైర‌ల్‌గా మారింది. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న పుష్ప 2తోపాటు కృష్ణ‌వంశీ రంగ‌మార్తాండ‌, ద‌ర్జా అనే మూవీల్లో న‌టిస్తోంది. ఇవి త్వ‌ర‌లో రిలీజ్ కానున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now