Speed Breaker : స్పీడ్ బ్రేక‌ర్‌ను అంత ఎత్తుగా క‌డ‌తారా ? మైండ్ ఉండే ఈ ప‌ని చేశారా ?

June 29, 2022 3:22 PM

Speed Breaker : మ‌న దేశంలో రోడ్లు అంటే.. అంతే.. ఒక్కో చోట అద్దం లాంటి రోడ్లు ఉంటాయి. ఇంకొన్ని చోట్ల అస‌లు రోడ్లే ఉండ‌వు. కొన్ని చోట్ల రోడ్లు మ‌న‌కు గుంత‌ల‌తో ద‌ర్శ‌న‌మిస్తాయి. ఇలా ఒక్కో చోట రోడ్లు ఒక్కో విధంగా ఉంటాయి. ఇక కొన్ని ర‌హ‌దారుల‌పై అయితే భారీ ఎత్తున స్పీడ్ బ్రేక‌ర్‌ల‌ను నిర్మిస్తుంటారు. ఒక ప‌ద్ధ‌తి, కొల‌త లేకుండానే ఇష్టానుసారంగా స్పీడ్ బ్రేక‌ర్ల‌ను వేస్తుంటారు. దీంతో వాహ‌న‌దారులు ప్ర‌మాదాల బారిన ప‌డ‌డ‌మో లేదా ఇంకేదైనా జ‌ర‌గ‌డ‌మో సంభ‌విస్తుంటాయి. స‌రిగ్గా ఓ వ్య‌క్తికి కూడా ఇలాగే జ‌రిగింది. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్‌కు చెందిన అభిషేక్ వ‌ర్మ త‌న‌కు ఇటీవ‌ల అక్క‌డి ఓ రోడ్డుపై ఎదురైన అనుభవాన్ని ట్విట్ట‌ర్ ద్వారా వివ‌రించాడు. తాను ఈ మ‌ధ్యే కొన్న కొత్త కియా సెల్టోస్ కారు సిటీలో ఓ చోట స్పీడ్ బ్రేక‌ర్‌పై స్ట‌క్ అయి నిలిచిపోయింద‌న్నాడు. స‌ద‌రు కారుకు గ్రౌండ్ క్లియ‌రెన్స్ 190 ఎంఎం ఉంది. అయిన‌ప్ప‌టికీ స్పీడ్ బ్రేక‌ర్ మ‌రీ పెద్ద‌గా ఎత్తుగా ఉంది. దీంతో కారు స్పీడ్ బ్రేక‌ర్ మీద‌కు వ‌చ్చి అలాగే నిలిచిపోయింది. వెన‌క్కి ముందుకు క‌ద‌ల‌లేక‌పోయింది.

Speed Breaker built very high car stopped on it
Speed Breaker

అయితే కొన్ని గంట‌ల పాటు తాను అలాగే ఉండాల్సి వ‌చ్చింద‌ని.. త‌రువాత ఒక ట్ర‌క్ స‌హాయంతో కారును పైకెత్తి అలాగే తీసుకుని వెళ్లాన‌ని చెప్పాడు. స‌ద‌రు స్పీడ్ బ్రేక‌ర్ గ‌న‌క చిన్న‌గా ఉండి ఉంటే త‌న‌కు ఈ ప‌రిస్థితి వ‌చ్చి ఉండేది కాద‌ని వాపోయాడు. త‌ల‌కాయ లేకుండా మైండ్ లేని విధంగా ఆ స్పీడ్ బ్రేక‌ర్‌ను నిర్మించారని, అస‌లు స్పీడ్ బ్రేక‌ర్ ఎక్క‌డైనా అంత ఎత్తుగా ఉంటుందా.. అని ప్ర‌శ్నించాడు. అయితే దీనికి సంబంధిత శాఖ అధికారులెవ‌రూ ఇప్ప‌టి వ‌ర‌కు అయితే స్పందించ‌లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now