Dil Raju : నిర్మాత దిల్ రాజుకు వార‌సుడొచ్చేశాడు..!

June 29, 2022 11:37 AM

Dil Raju : ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు మ‌ళ్లీ తండ్రి అయ్యారు. ఆయ‌న రెండో భార్య వైఘా రెడ్డి పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. దిల్ రాజు, వైఘా రెడ్డిల‌కు 2020లో లాక్ డౌన్ స‌మ‌యంలో వివాహం జ‌రిగింది. ఆయ‌న మొద‌టి భార్య అనితా రెడ్డి 2017లో మృతి చెందిన విష‌యం విదిత‌మే. త‌రువాత ఆయ‌న వైఘా రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమెకు ప్ర‌స్తుతం కొడుకు పుట్టాడు. జూన్ 29 రాత్రి ఆమె మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ప్ర‌స్తుతం తల్లీబిడ్డ ఇద్ద‌రూ క్షేమంగా ఉన్నారు.

కాగా దిల్‌రాజు మొద‌టి భార్య‌కు హ‌ర్షిత రెడ్డి అనే కుమార్తె జ‌న్మించ‌గా.. ఈమెకు వివాహం అయి పిల్ల‌లు కూడా ఉన్నారు. ఈ క్ర‌మంలోనే దిల్ రాజు, వైఘా రెడ్డిల వివాహం జ‌రిగిన‌ప్పుడు అంద‌రూ ఒక్క‌సారిగా షాక‌య్యారు. అయితే వీరు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు త‌ల్లిదండ్రులు అయ్యారు. దీంతో దిల్ రాజు దంప‌తుల‌కు శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్న‌యి.

Dil Raju couple blessed with baby boy
Dil Raju

దిల్ రాజు ఇప్ప‌టికే అనేక హిట్ చిత్రాల‌ను నిర్మించారు. ప్ర‌స్తుతం ఈయ‌న శంక‌ర్‌, రామ్ చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే విజ‌య్ వార‌సుడుతోపాటు ప‌లు ఇత‌ర చిత్రాల‌తో కూడా ఈయ‌న బిజీగా ఉన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now