Rajamouli : మ‌హేష్ బాబుతో మూవీని క‌న్‌ఫామ్ చేసిన రాజ‌మౌళి.. 3 ఏళ్లు ప‌డుతుంద‌ట‌..!

June 29, 2022 9:59 AM

Rajamouli : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ఇన్ని రోజుల పాటు ఆర్ఆర్ఆర్ మూవీ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేశారు. సినిమా రిలీజ్ అయ్యాక కొద్ది రోజుల‌కు ఆయ‌న వెకేష‌న్‌కు వెళ్లి వ‌చ్చారు. ఇక ఇప్పుడు ఆయ‌న త‌న త‌రువాతి సినిమాపై ఫోక‌స్ పెట్టారు. అందులో భాగంగానే ఆయ‌న తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఆఫ్రికా అడవుల నేప‌థ్యంలో యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ చిత్రంగా మ‌హేష్, రాజ‌మౌళి మూవీ ఉంటుంద‌ని విజ‌యేంద్ర ప్ర‌సాద్ హింట్ ఇచ్చారు. దీంతో సినిమాపై అప్పుడే భారీగా అంచ‌నాలు పెరిగాయి. అయితే మ‌హేష్‌తో చేయ‌బోయే సినిమాను రాజ‌మౌళి తాజాగా అధికారికంగా క‌న్‌ఫామ్ చేశారు. ఈ క్ర‌మంలోనే సినిమాను తీసి రిలీజ్ చేసేందుకు 3 ఏళ్ల స‌మ‌యం ప‌డుతుంద‌ని చెప్పారు. అంటే 2025 లో ఈ ఇద్ద‌రి మూవీ రిలీజ్ అవుతుంద‌ని తెలుస్తోంది.

కాగా రాజ‌మౌళి త‌న త‌దుపరి సినిమాకు గ్రాఫిక్స్‌ను అందించేందుకు గాను యూనిట్ ఇమేజ్ అనే సంస్థ‌ను సంప్ర‌దించారు. తాజాగా ఆయ‌న ఈ సంస్థ‌కు చెందిన స్టూడియోకు వెళ్లి ఆ ఓన‌ర్‌ను క‌లిశారు. ఫ్రాన్స్‌కు చెందిన యూనిట్ ఇమేజ్ సంస్థ 3డి యానిమేష‌న్‌, వీఎఫ్ఎక్స్ ప‌నులు చేస్తుంది. మ‌హేష్ తో చేయ‌బోయే సినిమాకు గ్రాఫిక్స్ అందించేందుకు రాజ‌మౌళి ఈ సంస్థ‌ను సంప్ర‌దించారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌మౌళి మ‌కుట కంపెనీతో గ్రాఫిక్స్ చేయిస్తున్నారు. కానీ మ‌హేష్ సినిమాకు వేరే సంస్థ‌ను ఎంపిక చేయాల‌ని చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. అందుక‌నే యూనిట్ ఇమేజ్ సంస్థ‌కు చెందిన స్టూడియోకు వెళ్లి ఆ ఓన‌ర్‌ను క‌లిసి రాజ‌మౌళి మాట్లాడారు. అయితే ఈ సంస్థ‌కే మ‌హేష్ మూవీ గ్రాఫిక్స్ ప‌నుల‌ను అప్ప‌గిస్తారా.. అన్న దానిపై క్లారిటీ లేదు. కానీ రాజ‌మౌళి మాత్రం మ‌హేష్‌తో సినిమా చేస్తున్న‌ట్లు క‌న్‌ఫామ్ చేశారు. దీంతో మ‌హేష్ ఫ్యాన్స్ సంబ‌ర ప‌డిపోతున్నారు. వీరి కాంబినేష‌న్‌లో రాబోతున్న తొలి చిత్రం కావ‌డంతో దీనిపై స‌హ‌జంగానే భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

Rajamouli confirmed Mahesh Babu movie will take 3 years
Rajamouli

ఇక ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు త్రివిక్ర‌మ్‌తో క‌లిసి సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ వ‌చ్చే ఏడాది ప్రారంభం వ‌ర‌కు పూర్తి కానున్న‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే 2023లో మ‌హేష్‌, రాజ‌మౌళి మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఇందుకు గాను జ‌క్క‌న్న ఇప్ప‌టి నుంచే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను చూసుకుంటున్నారు. అయితే ఈ మూవీ గురించి కీల‌క‌మైన అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అది ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now