Alia Bhatt : పెళ్ల‌యి 2 నెల‌లే.. ఆలియాభ‌ట్ ప్రెగ్నెంట్ అయింది..!

June 27, 2022 3:33 PM

Alia Bhatt : బాలీవుడ్ స్టార్ క‌పుల్‌గా పేరుగాంచిన ర‌ణ‌బీర్ క‌పూర్, ఆలియా భ‌ట్ దంప‌తులు బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వారే చెప్పారు. త‌మ తొలి శిశువును ఆహ్వానిస్తున్నామని వారు సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీంతో అది సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. వారు పెట్టిన పోస్ట్‌కు కేవ‌లం గంట‌లోనే 20 ల‌క్ష‌ల‌కు పైగా లైక్స్ వ‌చ్చాయి. చాలా మంది వీరికి బెస్టాఫ్ ల‌క్ చెబుతున్నారు.

ర‌ణ‌బీర్ క‌పూర్ ప‌క్క‌న కూర్చుని ఉండ‌గా.. సోనోగ్ర‌ఫీ స్కాన్ లో వారు త‌మ శిశువును చూసి మురిసిపోతున్నారు. ఆలియాభ‌ట్ ప‌డుకుని ఉంది. ఈ ఫొటోకు లైక్స్ విప‌రీతంగా వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే వీరు తల్లిదండ్రులు కాబోతుండ‌డంపై అంద‌రూ పెద్ద ఎత్తున శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. ఇక వీరు ఏప్రిల్ 14వ తేదీన వివాహం చేసుకోగా.. కేవ‌లం 2 నెల‌ల్లోనే ఆలియా త‌ల్లి కావ‌డం విశేషం. దీంతో అంద‌రూ షాక‌వుతున్నారు.

Alia Bhatt become pregnant announced on social media
Alia Bhatt

ఇక ర‌ణ‌బీర్‌, ఆలియా క‌ల‌సి న‌టించిన బ్ర‌హ్మాస్త్ర మూవీ ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 9వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కానుంది. అయితే కొర‌టాల శివ ఎన్‌టీఆర్‌తో చేస్తున్న మూవీకి ఆలియాను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ఆమె గ‌ర్భం క‌న్‌ఫామ్ కావ‌డంతో చిత్ర యూనిట్ ఇంకో హీరోయిన్‌ను ఎంపిక చేసే అవ‌కాశం ఉంది. అయితే ఆలియా స్థానంలో జాన్వీ క‌పూర్‌ను తీసుకుంటార‌ని తెలుస్తోంది. దీనిపై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now