Gali Janardhan Reddy : గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి హోమ్ థియేట‌ర్ చూశారా ? అచ్చం మినీ థియేట‌ర్‌లా ఉంది..!

June 27, 2022 10:11 AM

Gali Janardhan Reddy : మైనింగ్ కింగ్‌గా పేరుగాంచిన గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న అప్ప‌ట్లో త‌న కుమార్తె వివాహం కోసం ఏకంగా రూ.500 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు చేసి వార్త‌ల్లో నిలిచారు. ఆ వేడుక సంద‌ర్భంగా హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌త్యేకంగా డ్యాన్స్ చేసి ఒక్క రాత్రికే రూ.1 కోటి వ‌సూలు చేసింది. ఈ విధంగా అప్ప‌ట్లో ఆయ‌న కుమార్తె వివాహ విష‌యాలు వైర‌ల్ అయ్యాయి. అయితే ఆయ‌న మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచారు. తాజాగా ఆయ‌న ఒక్క రోజు సీఎం అవుతాన‌ని వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో నిల‌వ‌గా.. ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌నకు సంబంధించిన వార్త ఒక‌టి వైర‌ల్‌గా మారింది.

గాలి జ‌నార్ద‌న్ రెడ్డి క‌న్న‌డ న‌టుడు ర‌క్షిత్ శెట్టి ఇటీవ‌ల తీసిన 777 చార్లి అనే సినిమాను చూశారు. ఇంట్లోని త‌న హోమ్ థియేట‌ర్‌లో ఈ మూవీని ఆయ‌న కోసం ప్రైవేట్‌గా స్క్రీనింగ్ వేశారు. దీంతో త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఆయ‌న ఆ మూవీని చూశారు. అయితే ఆయ‌న హోమ్ థియేట‌ర్ చిన్నపాటి థియేట‌ర్‌ను పోలి ఉంది. అచ్చం థియేట‌ర్‌ల‌లోగే రిక్లైన‌ర్ సీట్లు కూడా ఉన్నాయి. ఒక సీట్‌లో ఆయ‌న కుక్క కూడా కూర్చుని సినిమా చూసింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న సినిమా చూస్తున్న ఫొటో ఒక‌టి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. ఈ మూవీని చూసిన అనంత‌రం ఆయ‌న సినిమా బాగుంద‌ని అన్నారు.

have you seen Gali Janardhan Reddy home theatre
Gali Janardhan Reddy

ఇక గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి కుమారుడు కిరీటి కూడా హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. రాధాకృష్ణ డైరెక్ష‌న్ లో అత‌ను న‌టిస్తున్నాడు. ఈగ నిర్మాత సాయి కొర్ర‌పాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ మూవీని మార్చి నెల‌లో లాంచ్ చేశారు. రాజ‌మౌళి చీఫ్ గెస్ట్‌గా హాజ‌రై సినిమాను ప్రారంభించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now