ఆకాశంలో అద్భుతం.. సూర్యుడి చుట్టూ వలయాకారంలో రెయిన్ బో.. ఫోటోలు వైరల్!

June 2, 2021 6:49 PM

బుధవారం హైదరాబాద్ మహానగరంలో ఆకాశంలో అద్భుతం చోటు చేసుకుంది. సూర్యుడి చుట్టూ వలయాకారంలో రెయిన్ బో ఏర్పడింది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్యుడి చుట్టూ వలయాకారంలో ఏర్పడిన ఈ అద్భుతమైన ఈ సంఘటనను చూడటానికి నగర ప్రజలు పెద్ద ఎత్తున బయటికి చేరుకున్నారు.

సూర్యుడు చుట్టూ ఈ విధంగా వలయాకారంలో ఇంద్ర ధనస్సు ఏర్పడటానికి గల కారణం వర్షం అని నిపుణులు చెబుతున్నారు. వర్షం కారణంగా వాతావరణంలో ఏర్పడిన నీటి బిందువులు మంచు స్పటికాలుగా మారతాయి. ఈ స్పటికాల పై సూర్యకిరణాలు ప్రతిబింబించినప్పుడు ఈ విధమైనటువంటి రంగుల హరివిల్లు ఏర్పడుతుంది. అయితే ఈ విధంగా వర్షం వచ్చే ముందుగా లేదా వర్షం వచ్చిన తర్వాత రెయిన్ బో ఏర్పడుతుంది. మంగళవారం రాత్రి హైదరాబాద్ లో వర్షం కురవడం వల్ల బుధవారం ఆకాశంలో ఈ అద్భుతం చోటు చేసుకుంది.

సూర్యుడి చుట్టూ పెద్దగా వలయాకారంలో ఏర్పడిన ఈ ఇంద్రధనస్సును చూడటానికి నగరవాసులు ఆసక్తి చూపించారు. కేవలం హైదరాబాద్ నగరంలో మాత్రమే కాకుండా, ఆంధ్రప్రదేశ్, కాలుష్య ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా ఈ అద్భుతం చోటు చేసుకుంది. ఈ అద్భుతాన్ని చూసిన ప్రజలు దీనిని వారి సెల్ ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now