Tollywood : విడాకుల‌కు సిద్ధ‌మ‌వుతున్న మ‌రో టాలీవుడ్ జంట‌..?

June 25, 2022 12:59 PM

Tollywood : ప్ర‌స్తుత త‌రుణంలో విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. కేవ‌లం సెల‌బ్రిటీలు మాత్రమే కాదు.. సాధార‌ణ ప్ర‌జ‌ల్లోనూ ఈ క‌ల్చ‌ర్ పెరిగిపోయింది. మారుతున్న జీవ‌న‌శైలి, వ్య‌వ‌హారాలు, ప్ర‌వ‌ర్త‌న‌, ఉద్యోగాలు, ఇత‌ర సంబంధాలు, ఆర్థిక స‌మ‌స్య‌లు.. ఇవ‌న్నీ విడాకుల‌కు కార‌ణం అవుతున్నాయి. ఇక సెల‌బ్రిటీలు అయితే చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. టాలీవుడ్ క్యూట్ క‌పుల్‌గా పేరు గాంచిన స‌మంత‌, నాగ‌చైత‌న్య విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించి అంద‌రినీ షాక్‌కు గురి చేశారు. త‌రువాత సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కుమార్తె ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్‌, ధ‌నుష్‌లు విడాకులు తీసుకున్నారు. ఇలా సెల‌బ్రిటీ క‌పుల్స్ చాలా మంది ఈ మ‌ధ్య కాలంలో విడాకులు తీసుకుంటున్నారు. ఇక త్వ‌ర‌లోనే మ‌రో టాలీవుడ్ జంట కూడా విడాకులు తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది.

టాలీవుడ్‌కు చెందిన ఓ జంట త్వ‌ర‌లో విడాకులు తీసుకోబోతున్నార‌నే వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ వార్త ప్ర‌స్తుతం హాట్ టాపిక్ అయింది. వారు విడాకులు తీసుకుంటున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా ఫిలిం న‌గ‌ర్‌లో మాత్రం వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వారు తెలుగు వెండితెర‌తోపాటు బుల్లితెర‌పై కూడా ప‌లు కార్య‌క్ర‌మాల్లో సంద‌డి చేశారు. వారి ఒక పాప ఉంది. ఇద్ద‌రూ సింగ‌ర్స్‌గా బాగానే సంపాదిస్తున్నారు. అయితే వీరు త్వ‌ర‌లో విడాకులు తీసుకోబోతున్నార‌ని తెలుస్తోంది.

another Tollywood couple preparing for divorce
Tollywood

కుటుంబ స‌భ్యులు, బంధువులు, స్నేహితులు ఎంతో చెప్పి చూశార‌ట‌. అయిన‌ప్ప‌టికీ వారు విడాకులు తీసుకునేందుకే మొగ్గు చూపుతున్నార‌ట‌. దీంతో చుట్టూ ఉన్న‌వారు చేసేదేం లేక అలాగే ఉండిపోయార‌ట‌. ఈ క్ర‌మంలోనే వారి విడాకులు దాదాపుగా ఖాయం అయిపోయిన‌ట్లేన‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి వారు ప్రేమించి పెద్ద‌ల‌ను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ విడాకుల‌కు దారి తీసిన కార‌ణాలు ఏమిట‌నేది తెలియ‌డం లేదు. భార్య‌భ‌ర్త ఇద్ద‌రూ సంపాదిస్తున్నారు క‌నుక‌.. ఇద్ద‌రికీ ఆర్థిక స్వాతంత్య్రం ఉంటుంది. అదే స‌మ‌స్య‌కు ప్ర‌ధాన కార‌ణంగా తెలుస్తోంది. అయితే వీరి విడాకుల విష‌యంపై త్వ‌రలోనే స్ప‌ష్ట‌త రానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment