Suhana Khan : షారూఖ్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్‌ను దారుణంగా ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు..!

June 24, 2022 5:08 PM

Suhana Khan : సెలబ్రిటీలు అన్నాక సోషల్‌ మీడియాలో అప్పుడప్పుడు వారిపై ట్రోలింగ్‌ జరుగుతూనే ఉంటుంది. ఇక స్టార్‌ హీరోల పిల్లలు అంటేనే ట్రోలింగ్‌ ఇంకాస్త ఎక్కువగానే జరుగుతుంటుంది. అలాంటడప్పుడు వారు బహిరంగ ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న మిస్టేక్‌ చేసినా జనాలకు దొరికిపోతారు. దీంతో ట్రోలింగ్‌ మరింత ఎక్కువవుతుంది. సరిగ్గా సుహానా ఖాన్‌ పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారూఖ్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్‌ ఇంకా సినిమాల్లోకి రాలేదు. వచ్చే ఏడాది ఓ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈమె తాజాగా ఓ చోట బయట కనిపించింది. దీంతో ఆమెతో ఫొటోలు దిగేందుకు కొందరు ఫ్యాన్స్‌ ఎగబడ్డారు. సుహానా.. అంటూ పిలిచారు. కానీ ఆమె వారిని అసలు పట్టించుకోలేదు. కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. దీంతో సుహానా ఖాన్‌ వైఖరిపై నెటిజన్లు మండిపడుతున్నారు. అంత పొగరు ఎందుకని ఆమెను ప్రశ్నిస్తున్నారు.

Suhana Khan being trolled by netizen for her bad behavior
Suhana Khan

కాగా సుహాన్‌ ఖాన్‌కు చెందిన ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆమెను నెటిజన్లు దారుణంగా ట్రోల్‌ చేస్తూ విమర్శిస్తున్నారు. ఫ్యాన్స్‌ ఫొటోలు అడిగితే అంత పొగరు ఎందుకు సుహానా.. అని ప్రశ్నిస్తున్నారు. ఇక సుహానా ఖాన్‌ ప్రస్తుతం ది ఆర్చీస్‌ అనే మూవీలో నటిస్తోంది. దీనికి జోయా అక్తర్‌ దర్వకత్వం వహిస్తుండగా.. రీమా కాట్గి సహ నిర్మాతగా ఉన్నారు. టైగర్‌ బేబీ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై నిర్మాణమవుతున్న ఈ మూవీ వచ్చే ఏడాదిలో రిలీజ్‌ కానుంది.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now