Naresh : ప‌విత్ర లోకేష్‌, న‌రేష్‌ల ర‌హ‌స్య వివాహం..? క్లారిటీ వ‌చ్చేసిన‌ట్లే..!

June 23, 2022 8:45 AM

Naresh : సీనియ‌ర్ న‌టుడు న‌రేష్, నటి ప‌విత్ర లోకేష్‌లు వివాహం చేసుకోబోతున్నార‌ని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం విదిత‌మే. అయితే వీటిని వారిద్ద‌రూ ఖండించ‌లేదు. పైగా ఈ ఇద్ద‌రూ క‌ల‌సి మ‌హాబ‌లేశ్వ‌రం వెళ్లి స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. దీంతో వీరి వివాహం నిజ‌మేన‌న్న వార్త‌లు ఊపందుకున్నాయి. అస‌లు వీరు ర‌హ‌స్య వివాహం చేసుకున్నార‌ని.. కావాల‌నే సీక్రెట్‌గా ఉంచుతున్నార‌ని.. త‌రువాత త‌మ పెళ్లి విష‌యం ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని.. ఈ మ‌ధ్య మ‌ళ్లీ వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. అయితే దీనిపై ఎట్ట‌కేల‌కు క్లారిటీ వ‌చ్చేసింది. న‌రేష్ పీఆర్ టీమ్ ఈ వార్త‌ల‌పై స్పందించింది.

న‌రేష్‌.. న‌టి ప‌విత్ర లోకేష్‌ను వివాహం చేసుకున్నార‌ని వస్తున్న వార్తల్లో ఎంత మాత్రం నిజం లేద‌ని న‌రేష్ పీఆర్ టీమ్ స్ప‌ష్టం చేసింది. అవ‌న్నీ అబ‌ద్ద‌మేన‌ని.. అలాంటిది ఏమైనా ఉంటే తాము తెలియ‌జేస్తామ‌ని.. క‌నుక వారి పెళ్లిపై వ‌స్తున్న వార్త‌ల‌ను న‌మ్మొద్ద‌ని కోరారు. దీంతో వీరు వివాహం చేసుకోలేద‌న్న విష‌యం మాత్రం స్ప‌ష్ట‌మై పోయింది. అయితే ఈ ఇద్ద‌రూ క‌ల‌సి తిరుగుతుండ‌డంపై మాత్రం అనేక అనుమానాలు ఉన్నాయ‌ని అంటున్నారు.

Naresh and Pavitra Lokesh married is it true given clarity
Naresh

న‌రేష్ ఇప్ప‌టికే రెండు పెళ్లిళ్లు చేసుకోగా.. ఆ ఇద్ద‌రు భార్య‌ల‌కు ఆయ‌న విడాకులు ఇచ్చేశారు. ఇక ప‌విత్ర లోకేష్ 2007లో క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన సుచేంద్ర ప్ర‌సాద్‌ను వివాహం చేసుకుంది. కానీ వీరి మ‌ధ్య వ‌చ్చిన మ‌న‌స్ఫ‌ర్థ‌లు వ‌చ్చాయి. దీంతో ప‌విత్ర లోకేష్ భ‌ర్త‌కు దూరంగా ఉంటోంది. అయితే న‌రేష్ తాను న‌టించే ప్ర‌తి సినిమాలోనూ ప‌విత్ర లోకేష్‌కు అవ‌కాశాలు ఇప్పిస్తున్నార‌ని.. అందుక‌నే ఆయ‌న న‌టించే సినిమాల్లో ఆమె కూడా న‌టిస్తుంద‌ని తెలుస్తోంది. ఈ మ‌ధ్యే వ‌చ్చిన అంటే సుంద‌రానికి చిత్రంలోనూ న‌రేష్‌తో పాటు ప‌విత్ర లోకేష్ కూడా న‌టించింది. క‌నుక‌నే పుకార్లు జోరందుకున్నాయి. అయితే ఎట్ట‌కేల‌కు ఈ స‌స్పెన్స్‌కు మాత్రం తెర ప‌డింద‌ని చెప్ప‌వ‌చ్చు.

కానీ ప‌విత్ర లోకేష్ ఇంకా విడాకులు తీసుకోలేద‌ని.. ఆ కార్య‌క్ర‌మం అయ్యాకే పెళ్లి చేసుకుందామ‌ని వారు అనుకుంటున్నార‌ని ఇంకో వార్త వైర‌ల్ అవుతోంది. క‌నుకనే వారు స‌హ‌జీవ‌నం చేస్తున్నార‌ని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి దీనిపై క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now