Akkineni Family : అక్కినేని ఫ్యామిలీ బండారం మొత్తం బ‌య‌ట పెట్టిన స‌మంత ?

June 20, 2022 5:28 PM

Akkineni Family : అక్కినేని నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి స‌మంత‌పై విమ‌ర్శ‌లు, ట్రోల్స్ ఎక్కువ‌గానే వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఆమెకు అక్కినేని ఫ్యాన్స్ నుంచే బెదిరింపులు కూడా వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. అప్ప‌ట్లో ఈ త‌ర‌హా విమ‌ర్శ‌లు బాగానే వ‌చ్చాయి. కానీ ఈ మ‌ధ్య కాలంలో ఆమెపై వ‌చ్చే ట్రోల్స్ త‌గ్గిన‌ట్లు తెలుస్తోంది. కానీ ఆమె ధ‌రించే దుస్తుల కార‌ణంగా ట్రోల్స్‌, విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటూనే ఉంది. అయితే త‌న విడాకులకు దారి తీసిన కార‌ణాల‌తోపాటు అక్కినేని ఫ్యామిలీ బండారం మొత్తాన్ని స‌మంత బ‌య‌ట పెట్టింద‌ట‌. ఈ మేర‌కు ఆమె కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో అన్ని విష‌యాల‌ను చెప్పేసిన‌ట్లు తెలుస్తోంది.

బాలీవుడ్‌లో కాఫీ విత్ క‌ర‌ణ్ షో ఎంతో పాపుల‌ర్ అయింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ఈ షోను నిర్వ‌హిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ సెల‌బ్స్‌ను ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ఇంట‌ర్వ్యూ చేశారు. అయితే ఈ షోకు కొత్త సీజ‌న్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది. ఇక ఈ సీజ‌న్‌లో ద‌క్షిణాది సెల‌బ్స్‌ను ఆయ‌న ఎక్కువ‌గా ఇంట‌ర్వ్యూ చేశార‌ట‌. రాజ‌మౌళి, చ‌ర‌ణ్, ఎన్‌టీఆర్‌, ప్ర‌భాస్‌తోపాటు ఇటీవ‌లే స‌మంత‌ను కూడా ఆయ‌న ఇంట‌ర్వ్యూ చేశార‌ట‌. అందుక‌నే స‌మంత మొన్నామ‌ధ్య ముంబై వెళ్లింద‌ని అంటున్నారు.

Samantha reportedly told everything about Akkineni Family
Akkineni Family

అయితే స‌మంత ఇటీవ‌ల ముంబై వెళ్లిన మాట వాస్త‌వ‌మే కానీ.. క‌ర‌ణ్ జోహార్ షోలో పాల్గొనేందుకేనా.. లేదా వేరే ఏదైనా కార‌ణ‌మా.. అన్న విష‌యం మాత్రం తెలియ‌లేదు. కానీ ఆమె ఆ షోలో పాల్గొంద‌నే అంటున్నారు. ఇక ఆమె అందులో ప‌లు కీల‌క విష‌యాల‌ను చెప్పేసింద‌ట‌. తాను విడాకుల‌ను ఎందుకు తీసుకుంది.. అందుకు దారి తీసిన ప‌రిస్థితులు.. చైతూతో వ‌చ్చిన గొడ‌వ‌లు వంటివాటితోపాటు అక్కినేని ఫ్యామిలీకి చెందిన ప‌లు ముఖ్య‌మైన విష‌యాల‌ను కూడా ఆమె ఆ షోలో చెప్పేసింద‌ట‌. దీంతో నాగార్జున ఫ్యామిలీలో క‌ల‌వ‌రం మొద‌లైన‌ట్లు తెలుస్తోంది.

అయితే కాఫీ విత్ క‌ర‌ణ్ షో అంటేనే మొద‌ట్నుంచీ వివాదాల‌కు మారుపేరుగా నిలిచింది. ఇందులో సెల‌బ్స్‌కు చెందిన ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యాల‌ను కూడా గుచ్చి గుచ్చి అడుగుతారు. అందుక‌నే క‌ర‌ణ్ జోహార్‌ను చాలా మంది విమ‌ర్శిస్తారు కూడా. ఈ క్ర‌మంలోనే ఆయ‌న షోలో పాల్గొన్న స‌మంత కూడా త‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను చాలా వ‌ర‌కు చెప్పేసింద‌ట‌. అక్కినేని ఫ్యామిలీ వ‌ల్ల తాను ఎన్ని ఇబ్బందులు ప‌డిందీ.. తాను ఎదుర్కొన్న స‌మ‌స్య‌లు.. వంటి వాటితోపాటు ఆ ఫ్యామిలీ బండారం మొత్తాన్ని ఆమె బ‌య‌ట పెట్టింద‌ట‌. ఈ క్ర‌మంలోనే ఈ విష‌యంపై సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం వార్త‌లు తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. అయితే నిజంగానే స‌మంత ఈ విష‌యాల‌ను చెప్పి ఉంటే.. వాటిని త్వ‌ర‌లో ప్రారంభం అయ్యే ఆ షోలో గ‌న‌క ప్ర‌సారం చేస్తే.. అప్పుడు అది చాలా సెన్సేష‌న‌ల్ అవుతుంది. అయితే నాగార్జున‌తో స‌త్సంబంధాలు ఉన్న క‌ర‌ణ్ జోహార్ ఆ ప‌ని చేస్తారా.. అస‌లు ఈ వార్త‌ల‌న్నీ నిజ‌మేనా.. అన్న విష‌యాలు తెలియాల్సి ఉంది. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాలో ఈ వార్త‌లు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now