Satya Dev Godse Movie Review : స‌త్య‌దేవ్ న‌టించిన గాడ్సె మూవీ రివ్యూ..!

June 17, 2022 2:57 PM

Satya Dev Godse Movie Review : వైవిధ్య భ‌రిత‌మైన చిత్రాల‌లో భిన్నమైన క్యారెక్ట‌ర్ల‌లో న‌టించ‌డంలో న‌టుడు స‌త్య‌దేవ్‌కు ఎంతో పేరుంది. ఈయ‌న చిన్న బ‌డ్జెట్ సినిమాలు తీసి హిట్స్ కొడుతూనే మ‌రోవైపు ఇత‌ర హీరోల‌కు చెందిన చిత్రాల్లోనూ చిన్న చిన్న పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అయితే ఈయ‌న హీరోగా లేటెస్ట్‌గా వ‌చ్చిన చిత్రం.. గాడ్సె. ఈ మూవీ ట్రైల‌ర్ అద్భుతంగా ఉంద‌ని ఇప్ప‌టికే టాక్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా శుక్ర‌వారం (జూన్ 17) థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇక సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఒక లుక్కేద్దాం.

క‌థ‌..

ఉన్న‌ట్లుండి స‌డెన్ గా మంత్రుల కిడ్నాప్‌లు జ‌రుగుతుంటాయి. ఒక‌రి వెంట మ‌రొక‌రు కిడ్నాప్‌ల‌కు గుర‌వుతుంటారు. ఈ క్ర‌మంలోనే ఆ కిడ్నాప్‌ల‌ను చేస్తోంది గాడ్సె అని తెలుస్తుంది. దీంతో ఈ కేసును ఛేదించేందుకు స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఆఫీస‌ర్ వైష్ణ‌వి (ఐశ్వ‌ర్య లక్ష్మి)ని ప్ర‌భుత్వం నియ‌మిస్తుంది. ఈ క్ర‌మంలో ఆమె కిడ్నాప‌ర్ గురించి అస‌లు విష‌యాలు తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. అత‌నితో కాంటాక్ట్ అవుతూ అత‌ని డిమాండ్స్ ఏమిటో చెప్పాల‌ని అడుగుతుంది. అయితే చివ‌ర‌కు ఏం జ‌రుగుతుంది ? అస‌లు గాడ్సె ఎవ‌రు ? అత‌ను మంత్రుల‌ను ఎందుకు కిడ్నాప్ చేస్తాడు ? అత‌న్ని వైష్ణ‌వి అరెస్టు చేస్తుందా ? అసలు ఏమ‌వుతుంది ? వ‌ంటి వివ‌రాల‌ను తెలుసుకోవాలంటే సినిమాను వెండితెర‌పై చూడాల్సిందే.

Satya Dev Godse Movie Review know how is the movie
Satya Dev Godse Movie Review

ఈ మూవీలో గాడ్సెగా సత్య‌దేవ్ అన్నీ తానే అయి సినిమాను ముందుండి న‌డిపించాడు. అందువ‌ల్ల ప్ర‌తి సీన్‌లోనూ ఆయ‌నే క‌నిపిస్తాడు. ఇక ఐశ్వ‌ర్య ల‌క్ష్మి కూడా త‌న పాత్ర‌లో బాగానే న‌టించింద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే రొటీన్ స్టోరీ కావ‌డం, మిగిలిన న‌టీన‌టుల‌ను బాగా వాడుకోక‌పోవ‌డం, సినిమాలో త‌రువాత ఏం జ‌రుగుతుందో ముందుగానే ఊహించ‌గ‌ల‌గ‌డం.. బోరింగ్ సెకండాఫ్ వంటివి సినిమాకు మైన‌స్ అని చెప్ప‌వ‌చ్చు. అయితే ఓవ‌రాల్‌గా చెప్పాలంటే కాస్త భిన్న‌మైన సినిమాను చూడ‌ద‌లిస్తే.. ఈ మూవీకి వెళ్ల‌వ‌చ్చు. లేదంటే వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now