Deepika Padukone : అక‌స్మాత్తుగా హార్ట్ రేట్ పెరిగింది.. దీపికా ప‌దుకొనెకి ఐసీయూలో చికిత్స‌..

June 14, 2022 4:23 PM

Deepika Padukone : నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం.. ప్రాజెక్ట్ కె. ఇందులో ప్ర‌భాస్‌కు జోడీగా దీపికా ప‌దుకొనె న‌టిస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్‌ను హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో చేప‌డుతున్నారు. దీపికా ప‌దుకొనె ఇటీవ‌లే చిత్ర యూనిట్‌తో జాయిన్ అయింది. ఈ మూవీలో ఆమె తాలూకు స‌న్నివేశాల‌ను ప్ర‌స్తుతం చిత్రీక‌రిస్తున్నారు. అయితే దీపికా ప‌దుకొనె అస్వ‌స్థ‌త‌కు గురైంది. ఈ క్ర‌మంలోనే ఆమెను హుటా హుటిన హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు.

దీపికా ప‌దుకొనెకు ఉన్న‌ట్లుండి స‌డెన్‌గా హార్ట్ రేట్ పెరిగింది. దీంతో ఆమెను వెంట‌నే కామినేని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. కాగా దీపికా 3 రోజుల క్రిత‌మే హాస్పిట‌ల్‌కు వెళ్లింది. జ‌న‌ర‌ల్ చెక‌ప్ కోస‌మే వెళ్ల‌గా.. ఆమె అప్పుడు ఆరోగ్యంగా ఉన్న‌ట్లు చెప్పారు. కానీ షూటింగ్ స‌మ‌యంలో స‌డెన్‌గా హార్ట్ రేట్ పెర‌గ‌డంతో ఆమె అస్వ‌స్థ‌త‌కు గురైంది. దీంతో ఆమెను వెంట‌నే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఇక ఆమె ప్ర‌స్తుత ఆరోగ్య స్థితిపై వైద్యులు వివ‌రాల‌ను వెల్లడించ‌నున్నారు.

Deepika Padukone taking treatment in ICU after got illness
Deepika Padukone

కాగా ప్రాజెక్ట్ కెలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, దిశా పటాని వంటి ఇత‌ర బాలీవుడ్ ప్ర‌ముఖులు కూడా న‌టిస్తున్నారు. అత్యంత అధునాత‌న హై ఎండ్ వీఎఫ్ఎక్స్‌తో ఈ మూవీని వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. మిక్కీ జె మేయ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు డాని శాంచెజ్ లోపెజ్ సినిమాటోగ్ర‌ఫీ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now