Virata Parvam : ఓటీటీలో విరాట ప‌ర్వం.. రిలీజ్ ఎందులో అంటే..?

June 13, 2022 1:52 PM

Virata Parvam : ద‌గ్గుబాటి రానా, సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌స్తున్న చిత్రం.. విరాట ప‌ర్వం. ఈ మూవీ షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ అన్ని ప‌నులు ఎప్పుడో పూర్త‌యినా సినిమా విడుద‌ల చాలా ఆల‌స్యం అయింది. అనేక కార‌ణాల వ‌ల్ల మూవీ రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్టకేల‌కు ఈ మూవీని జూన్ 17న రిలీజ్ చేస్తున్నారు. ఈక్ర‌మంలోనే చిత్ర ప్ర‌మోష‌న్స్‌ను ప్ర‌స్తుతం వేగవంతం చేశారు. ఇక తాజాగా చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా నిర్వ‌హించారు. ఇందులో సాయి ప‌ల్ల‌వి ఎమోష‌న‌ల్ అయింది. త‌నను ఆ విధంగా చూడొద్ద‌ని కోరింది. దీంతో ఆమె కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

ఇక ఈ మూవీకి ఊడుగుల వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్‌, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకాల‌పై నిర్మించారు. తమ సొంత బ్యాన‌ర్‌పైనే ఈ మూవీని నిర్మించిన‌ప్ప‌టికీ ఈ మూవీ రిలీజ్ ఇంత ఆల‌స్యం ఎందుకు అయిందో రానా చెప్ప‌లేదు. అయితే ఈ సినిమా విడుద‌లయ్యాక నాలుగు వారాల్లో.. అంటే జూలై 17 త‌రువాత ఓటీటీలో రిలీజ్ అవుతుంద‌ని మేక‌ర్స్ ప్ర‌కటించారు. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో అదే యాప్‌లో ఈ మూవీ రిలీజ్ కానుంద‌ని తెలుస్తోంది.

Virata Parvam soon to release on Netflix
Virata Parvam

కాగా ఈ మూవీలో నందితా దాస్‌, న‌వీన్ చంద్ర‌, ప్రియ‌మ‌ణి, నివేతా పేతురాజ్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించ‌గా.. డానీ శాంచెజ్ లోపెజ్‌, దివాక‌ర్ మ‌ణి సినిమాటోగ్ర‌ఫీ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించారు. ఇందులో రానా, సాయి ప‌ల్లవిలు ర‌వ‌న్న‌, వెన్నెల‌గా న‌క్స‌ల్స్ పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైల‌ర్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now