NTR : వామ్మో.. ఆ కార్ నంబ‌ర్ కోసం ఎన్టీఆర్ అంత చెల్లించారా ?

June 12, 2022 11:27 PM

NTR : సాధార‌ణంగా సెల‌బ్రిటీలు అత్యంత విలాస‌వంతమైన కార్ల‌నే ఉపయోగిస్తుంటారు. అవి రూ.కోట్ల‌లో ధ‌ర క‌లిగి ఉంటాయి. అత్యంత అధునాత‌న ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంటాయి. ఇక అలాంటి కార్లు మ‌న దేశంలో ల‌భించ‌క‌పోతే భారీ ఎత్తున ప‌న్ను చెల్లించి మ‌రీ వాటిని దిగుమ‌తి చేసుకుంటుంటారు. అయితే విలాస‌వంత‌మైన కార్ల‌ను వాడ‌డంతో ఎన్‌టీఆర్ అంద‌రిక‌న్నా ముందే ఉంటార‌ని చెప్ప‌వ‌చ్చు. ఇప్ప‌టికే ఆయ‌న ద‌గ్గ‌ర అత్యంత ఖ‌రీదు గ‌ల కార్లు బాగానే ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ త‌న తాత లాగే కార్ల‌కు ఓ ప్ర‌త్యేక‌మైన నంబ‌ర్‌నే ఉప‌యోగిస్తుంటారు.

సీనియ‌ర్ ఎన్టీఆర్ త‌న కార్ల‌కు 9 అంకె ఉండే నంబర్ల‌నే ఎంపిక చేసుకునేవారు. అంటే.. 9, 99, 999, 9999 ఇలా అన్న‌మాట‌. ఇక త‌న తాత పేరు పెట్టుకుని ఆయ‌న అంశ‌లోనే జ‌న్మించాడు క‌నుక జూనియర్ ఎన్‌టీఆర్ కూడా త‌న తాత విశ్వాసాల‌నే నమ్ముతుంటారు. అందుక‌నే ఆయ‌న కూడా 9 అంకె వ‌చ్చేలా ఉండే నంబ‌ర్ల‌నే త‌న కార్ల‌ను ఉప‌యోగిస్తుంటాడు. ఇక ఈ మ‌ధ్యే ఎన్‌టీఆర్ అత్యంత ఖ‌రీదు పెట్టి లంబోర్గిని ఉరుస్ గ్రాఫైట్ కాప్సూల్ కార్‌ను కొన్నారు.

NTR paid huge amouth for that fancy car number
NTR

కాగా ఎన్టీఆర్ తాను కొన్న కొత్త కారుకు 9999 అనే నంబ‌ర్‌ను తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఖైర‌తాబాద్ ఆర్‌టీఏ నుంచి టీఎస్‌09 ఎఫ్ఎస్ 9999 అనే నంబ‌ర్‌ను త‌న కారుకు పొందారు. ఇందుకు గాను ఆయ‌న అప్ప‌ట్లోనే రూ.17 ల‌క్ష‌లు చెల్లించారు. అయితే ఫ్యాన్సీ నంబ‌ర్ల‌ను కార్ల‌కు తీసుకునేందుకు చాలా మంది వాటిని ఆన్‌లైన్‌లో వెతుకుతుంటారు. అందుక‌నే ఎన్‌టీఆర్ తీసుకున్న నంబ‌ర్ వార్త మ‌ళ్లీ వైర‌ల్ అవుతోంది. ఇక ప్ర‌తి సారి ఇలా ఆర్‌టీఏ అధికారులు ఫ్యాన్సీ నంబ‌ర్లకు వేలం నిర్వ‌హించ‌డం ద్వారా భారీ మొత్తంలో ఆదాయం పొందుతున్నారు.

ntr

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment