Sai Pallavi : శ‌భాష్.. మ‌ళ్లీ తానేంటో నిరూపించుకున్న సాయి ప‌ల్ల‌వి..!

June 9, 2022 12:13 PM

Sai Pallavi : సాయిప‌ల్ల‌వి న‌ట‌న‌లోనే కాదు.. డ్యాన్స‌ర్‌గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె గ్లామ‌ర్ రోల్స్ చేయ‌న‌ని స్ప‌ష్టంగా చెప్పేసింది. అలాంటి పాత్ర‌లు ఉండే సినిమాల‌ను తిర‌స్క‌రిస్తాన‌ని తెలియ‌జేసింది. త‌న‌కు న‌టిగా మంచి గుర్తింపును తెచ్చే సినిమాల‌నే చేస్తాన‌ని చెప్పింది. అలాగే న‌టిస్తుంది కూడా. గ్లామ‌ర్ షో చేయ‌న‌ప్ప‌టికీ సాయి ప‌ల్ల‌విది ప్ర‌త్యేక శైలి. క‌నుక ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆమెతో సినిమాలు చేసేందుకు ఆస‌క్తిని చూపిస్తుంటారు కూడా. ఇక ఎలాంటి యాడ్స్‌లోనూ న‌టించ‌న‌ని ఇదివ‌ర‌కే సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం చేసింది. దీంతో ఆమె వ్య‌క్తిత్వం ఎలాంటిదో అంద‌రికీ తెలిసిపోయింది.

కాగా సాయిప‌ల్ల‌వికి రూ.2 కోట్లు ఇస్తామ‌ని ఓ ప్ర‌ముఖ ఎంట‌ర్‌టైన్‌మెంట్ చాన‌ల్ వారు ఆఫ‌ర్ చేశార‌ట‌. ఆ చాన‌ల్ వారు నిర్వ‌హించే షోస్, సీరియ‌ల్స్, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌మోట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇది చిన్న ఆఫ‌ర్ ఏమీ కాదు. రూ.2 కోట్లు అంటే త‌క్కువేమీ కాదు. కానీ సాయిప‌ల్ల‌వి ఈ ఆఫ‌ర్‌ను కూడా సున్నితంగా తిర‌స్క‌రించింద‌ట‌. ఆ చాన‌ల్ వారు చేసే కార్య‌క్ర‌మాలు ఏమిటో తెలియ‌కుండా తాను వాటిని ఎలా ప్ర‌మోట్ చేస్తాన‌ని.. ఆమె అడిగింద‌ట‌. దీంతో వారు స‌మాధానం చెప్ప‌లేక‌పోయార‌ట‌. క‌నుక రూ.2 కోట్ల ఆఫ‌ర్‌ను కూడా ఆమె రిజెక్ట్ చేసింద‌ని తెలుస్తోంది.

Sai Pallavi proved herself once again rejected huge endorsement
Sai Pallavi

ఇక సాయిప‌ల్ల‌వి ఇప్పుడే కాదు.. గ‌తంలోనూ ఇలాంటి ఓ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించింది. ఓ ప్ర‌ముఖ ఫెయిర్‌నెస్ క్రీమ్ బ్రాండ్ త‌మ బ్యూటీ ప్రొడ‌క్ట్స్‌ను ప్ర‌మోట్ చేస్తే భారీ మొత్తంలో ముట్ట‌జెబుతామ‌ని ఆఫ‌ర్ ఇచ్చింద‌ట‌. అయితే తాను స‌హ‌జ‌సిద్ధ‌మైన అందానికే ప్రాధాన్య‌త‌ను ఇస్తాన‌ని.. క‌నుక బ్యూటీ ప్రొడ‌క్ట్స్‌ను ప్ర‌మోట్ చేయ‌లేన‌ని స్ప‌ష్టంగా చెప్పేసింది. ఈ క్ర‌మంలో ఆ ఆఫ‌ర్‌ను ఆమె వ‌దులుకుంది. ఇప్పుడు మ‌రోమారు త‌న వ్య‌క్తిత్వం ఏమిటో చాటి చెప్పింది. దీంతో సాయిప‌ల్ల‌విని అంద‌రూ అభినందిస్తున్నారు. కేవ‌లం డ‌బ్బుల కోస‌మే అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసే హీరోయిన్లు అధికంగా ఉన్న నేటి త‌రుణంలో సాయిప‌ల్ల‌వి లాంటి వారు మ‌న క‌ళ్ల ఎదుట క‌నిపిస్తుండ‌డం నిజంగా న‌మ్మ‌బుద్ధి కావ‌డం లేద‌ని కామెంట్లు చేస్తున్నారు. చాలా మంది నెటిజ‌న్లు సాయిప‌ల్ల‌వి తీసుకున్న నిర్ణ‌యాన్ని ప్ర‌శంసిస్తున్నారు. అందుక‌నే ఆమెకు ఫ్యాన్స్ కూడా ఎక్కువ‌గానే ఉన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment