Sri Reddy : వాళ్ల‌ను న‌మ్ముకుంటే.. ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేదు.. వాపోయిన శ్రీ‌రెడ్డి..!

June 9, 2022 10:17 AM

Sri Reddy : న‌టి శ్రీ‌రెడ్డి ఈమ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. స‌మాజంలో జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌ల‌పై ఈమె స్పందిస్తూనే.. త‌న సొంత యూట్యూబ్ చానల్‌లో వంటల వీడియోల‌ను పోస్ట్ చేస్తోంది. వాటికి ఆద‌ర‌ణ బాగానే ల‌భిస్తోంది. అయితే శ్రీ‌రెడ్డి యాక్టివ్ రాజ‌కీయాల్లో లేదు. కానీ వైసీపీకి ఎల్ల‌ప్పుడూ మ‌ద్ద‌తు ఇస్తుంటుంది. జ‌గ‌న్ అంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని చెబుతుంటుంది. అయితే తాజాగా ఆమె వైసీపీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఇంత‌కీ అస‌లు ఏం జరిగిందంటే..

శ్రీ‌రెడ్డి తాజాగా ఏపీ ప్ర‌భుత్వంపై అసంతృప్తిని వ్య‌క్తం చేసింది. ఈ మేర‌కు ఆమె ఓ వీడియోలో మాట్లాడుతూ.. రాజ‌కీయ పార్టీల‌కు మ‌ద్ద‌తు ఇస్తే.. డ‌బ్బు ఇస్తార‌ని అనుకుంటార‌ని.. కానీ అందులో నిజం లేద‌ని శ్రీ‌రెడ్డి తెలిపింది. త‌న‌కు వైసీపీ ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేదంది. పార్టీని న‌మ్ముకున్న కార్య‌క‌ర్త‌ల‌ను పార్టీ మ‌రిచిపోకూడ‌ద‌ని పేర్కొంది. త‌మ గ్రామంలో తాను, తన తండ్రి క‌ల‌సి శ్రీ‌వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యాన్ని ప్రారంభించామ‌ని.. దీనికి టీడీపీ హ‌యాంలో నిధులు వ‌చ్చాయ‌ని తెలియ‌జేసింది.

Sri Reddy says she is unable to build temple lack of funds
Sri Reddy

అయితే వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేద‌ని విచారం వ్య‌క్తం చేసింది. తాను ఇదే విష‌యంపై ఎంతో మంది వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల‌ను క‌లిశాన‌ని.. అయిన‌ప్ప‌టికీ ఎవ‌రూ ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేద‌ని తెలిపింది. ఈ క్ర‌మంలో త‌మ దేవుడు గుడి బ‌య‌ట‌నే ఉన్నాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. నిధుల కోసం తాము ఎంతో ప్ర‌య‌త్నించామ‌ని, అయిన‌ప్ప‌టికీ వీలు కాలేద‌ని పేర్కొంది. అయితే ఉన్న‌ట్లుండి శ్రీ‌రెడ్డి స‌డెన్‌గా వైసీపీ ప్ర‌భుత్వంపై ఇలా విమ‌ర్శ‌లు ఎందుకు చేస్తుందో అర్థం కావ‌డం లేద‌ని కొంద‌రు అంటున్నారు. మ‌రి ఇలాగైనా ఆమె త‌న స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుంటుందా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now