Mahesh Babu : మ‌హేష్ ప‌క్క‌న హీరోయిన్ ఆమెనా.. బాబోయ్ వ‌ద్దంటున్న ఫ్యాన్స్‌..!

June 8, 2022 10:28 PM

Mahesh Babu : సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట స‌క్సెస్ జోష్ లో ఉన్నారు. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ మూవీ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. స‌మాజానికి మెసేజ్ ఇచ్చే సినిమా కావ‌డంతో ప్రేక్ష‌కులు ఈ మూవీకి బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అయితే ఈ మూవీ ఇప్ప‌టికీ థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శితం అవుతూనే ఉంది. అయిన‌ప్ప‌టికీ ఓటీటీలో ఈ మూవీని రిలీజ్ చేశారు. రూ.199 చెల్లించి పే ప‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో ఈ మూవీని ప్రేక్ష‌కులు వీక్షించ‌వ‌చ్చు.

ఇక స‌ర్కారు వారి పాట అనంత‌రం కొద్ది రోజుల పాటు విరామంలో ఉన్న మ‌హేష్ మ‌ళ్లీ త‌న త‌దుపరి సినిమా చేయ‌నున్నారు. ఆయ‌న త్రివిక్ర‌మ్‌తో క‌లిసి త్వ‌ర‌లో ఓ మూవీని చేయ‌నున్నారు. ఇందులో హీరోయిన్‌గా ఇప్ప‌టికే పూజా హెగ్డెను ఎంపిక చేశారు. పూజా గ‌తంలో మ‌హేష్ తో మ‌హ‌ర్షి సినిమా చేయ‌గా.. అది హిట్ అయింది. అలాగే త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఆమె అర‌వింద స‌మేత‌, అల వైకుంఠ పుర‌ములో సినిమాల‌ను చేసింది. దీంతో ఈ ముగ్గురి కాంబినేష‌న్ మ‌ళ్లీ హిట్ అవుతుంద‌ని భావిస్తున్నారు. అయితే త్రివిక్ర‌మ్ తో ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు సినిమాను పూర్తి చేయాల‌ని మ‌హేష్ భావిస్తున్నారు. దీంతో వ‌చ్చే ఏడాది నుంచి రాజ‌మౌళి సినిమాను చేయ‌వ‌చ్చ‌ని ఆయన ప్లాన్‌. అదేవిధంగా ఆయ‌న షెడ్యూల్‌ను కూడా పూర్తి చేయ‌నున్నార‌ని స‌మాచారం.

Shraddha Kapoor as heroine for Mahesh Babu movie fans say no
Mahesh Babu

అయితే రాజ‌మౌళితో క‌ల‌సి చేయ‌బోయే సినిమాకు గాను ఆయ‌న తండ్రి విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇప్ప‌టికే క‌థ గురించి ఒక హింట్ ఇచ్చారు. ఆఫ్రికా అడ‌వుల నేప‌థ్యంలో యాక్ష‌న్‌, అడ్వెంచ‌ర్ జోన‌ర్‌ల‌లో ఈ మూవీ తెర‌కెక్కుతుంద‌ని అన్నారు. దీంతో సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. అయితే ఈ మూవీ 2023 ఆరంభంలో షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తుండ‌గా.. ఇందులో హీరోయిన్‌ను అయితే ఇంకా ఎంపిక చేయ‌లేదు. కానీ సాహో బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్‌ను మ‌హేష్ కు జోడీగా ఎంపిక చేయాల‌ని చూస్తున్నార‌ట‌. అయితే ఈ విష‌యంపై మ‌హేష్ ఫ్యాన్స్ గ‌గ్గోలు పెడుతున్నారు. ఆమె సాహోలో న‌టించింది. ఆ సినిమా ఫ్లాప్ అయింది. క‌నుక ఆమె హీరోయిన్‌గా వ‌ద్దే వ‌ద్దు.. అని మ‌హేష్ ఫ్యాన్స్ అంటున్నార‌ట‌. అయితే ఫ్యాన్స్ విజ్ఞ‌ప్తిని జ‌క్క‌న్న ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారా.. లేదా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now