Kalyaan Dhev : ప్చ్‌.. చిరంజీవి చిన్నల్లుడిని పట్టించుకునే వారే లేరే..?

June 5, 2022 9:14 AM

Kalyaan Dhev : చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ భర్త కల్యాణ్‌ దేవ్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన విజేత సినిమాలో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తరువాత సూపర్‌ మచ్చి అనే సినిమా చేశాడు. కానీ ఇది కూడా ఆలస్యంగా విడుదలై ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇక కల్యాణ్‌ తరువాత కిన్నెరసాని అనే మరో మూవీ చేశాడు. అయితే ఈ మూవీ ఎప్పుడో విడుదల కావల్సి ఉన్నా.. అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలోనే త్వరలో ఈ మూవీని రిలీజ్‌ చేయనున్నారు. అయితే థియేటర్లలో మాత్రం కాదు.. ఓటీటీలో. జీ5 యాప్‌లో ఈ మూవీని నేరుగా రిలీజ్‌ చేయనున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.

అయితే శ్రీజతో విడిగా ఉంటున్నాడన్న కారణమో.. లేక మెగాఫ్యామిలీకి దూరం అయ్యాడన్న కారణమో తెలియదు కానీ.. గతంలో కల్యాణ్‌ దేవ్‌ను తమ మనిషి అనుకున్న మెగా ఫ్యాన్స్‌ ప్రస్తుతం ఆయనను దూరం పెట్టేశారు. శ్రీజ, కల్యాణ్‌ దేవ్‌ విడిపోయారని వార్తలు వస్తుండడం.. మరోవైపు మెగా ఫ్యామిలీ వేడుకల్లో ఎక్కడా కల్యాణ్‌ కనిపించకపోవడం.. ఆయన సినిమాలను మెగా ఫ్యామిలీ పట్టించుకోకపోవడంతో.. ప్రేక్షకులు కూడా కల్యాణ్‌ను లైట్‌ తీసుకుంటున్నట్లు అర్థమవుతోంది. లేదంటే శ్రీజతో కలసి ఉండి ఉంటే ఆయన సినిమాను తప్పక థియేటర్లలో రిలీజ్‌ చేసి ఉండేవారని అర్థం చేసుకోవచ్చు. అంటే.. వారు విడిపోయారని ఈ మూవీతో మరోమారు స్పష్టమవుతోంది. అయితే దీనిపై వారు ఇంకా అధికారికంగా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే ఇవన్నీ పక్కన పెడితే కల్యాణ్‌ దేవ్‌ను మాత్రం ప్రస్తుతం పట్టించుకునే వారే కరువయ్యారు. ఆయనను లైట్‌ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Kalyaan Dhev latest movie Kinnerasani directly releasing on OTT
Kalyaan Dhev

ఇక కిన్నెర సాని మూవీని జీ5 లో ఈ నెల 10న రిలీజ్‌ చేయనున్నారు. దీన్ని అశ్వత్థామ దర్శకుడు రమణ తేజ తెరకెక్కించగా.. పవన్‌ స్నేహితుడు రామ్‌ తాళ్లూరి నిర్మించారు. ఇందులో మళయాళ భామ షీతల్‌ హీరోయిన్ గా నటించింది. రవీంద్ర విజయ్‌ ముఖ్య పాత్రలో నటించారు. థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now