Vishwak Sen : ఓటీటీలోకి వచ్చేసిన విశ్వక్‌ సేన్‌ సినిమా.. ఎందులో అంటే..?

June 3, 2022 9:45 PM

Vishwak Sen : విశ్వక్‌సేన్‌, రుక్సార్ ధిల్లాన్‌లు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం.. అశోకవనంలో అర్జున కల్యాణం. ఈ మూవీ మే 6వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే సాధించినప్పటికీ థియేటర్లకు ప్రేక్షకులను రప్పించలేకపోయింది. అయితే విశ్వక్ సేన్‌, దేవీ నాగవల్లిల మధ్య గొడవ కారణంగా ఈ మూవీకి కావల్సినంత పబ్లిసిటీ అయితే వచ్చింది. అయినప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపలేదు. అయితే నెల రోజుల తరువాత ఈ మూవీ ఓటీటీలో రిలీజ్‌ అయింది.

అశోకవనంలో అర్జున కల్యాణం సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతోంది. ఫ్యామిలీ డ్రామా, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ను కోరుకునే వారు ఈ మూవీని ఒకసారి చూసి ఎంజాయ్‌ చేయవచ్చు. ఇందులో విశ్వక్‌ సేన్‌, రుక్సార్‌ ధిల్లాన్‌ల మధ్య ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయింది. ఓటీటీలో ఈ మూవీకి మంచి స్పందనే లభిస్తోంది. ఇక ఈ మూవీకి ఎన్ని వ్యూస్‌ వస్తాయో చూడాలి.

Vishwak Sen movie Ashoka Vanamlo Arjuna Kalyanam came into OTT
Vishwak Sen

ఈ మూవీకి విద్యాసాగర్‌ చింతా దర్శకత్వం వహించగా.. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. రవి కిరణ్‌ చోళ కథను అందించారు. సినిమా ఆద్యంతం నవ్వుల పువ్వులు పూయిస్తుంది. అయితే థియేటర్లలో అంతగా ఈ మూవీ హిట్‌ కాకపోయినా.. ఓటీటీలో అయినా హిట్‌ అవుతుందని మేకర్స్‌ ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now