Prudhvi Raj : కమెడియన్‌ పృథ్వి కుమార్తెను చూశారా..? ఎంత అందంగా ఉందో..!

June 2, 2022 4:03 PM

Prudhvi Raj : కమెడియన్‌ పృథ్వి.. ఈయననే 30 ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీ అని కూడా పిలుస్తారు. ఈయన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాల్లో కమెడియన్‌ గా ఆకట్టుకున్నారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ రాణించారు. అయితే గత కొంత కాలంగా పృథ్వీ సినిమాల్లో ఆఫర్ల కోసం అవస్థలు పడుతున్నారు. ఈయన గతంలో వైసీపీలో చేరారు. ఓ పదవిలో కొనసాగారు. తరువాత ఆయనపై కొన్ని ఆరోపణలు రావడంతో తన పదవికి ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి మళ్లీ సినిమాల్లోనే బిజీ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు. అయితే ఈయనకు కుమార్తె కూడా ఉంది. ఆమె ఇప్పుడు ఓ సినిమాలో హీరోయిన్‌గా కూడా నటిస్తోంది. ఈ మేరకు ఆ చిత్ర విశేషాలను పృథ్వి మీడియాతో పంచుకున్నారు. మీడియాతో మాట్లాడుతూ పృథ్వి పలు విషయాలను వెల్లడించారు.

తన కుమార్లె శ్రీలు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేసిందని.. మలేషియా వెళ్లి సెటిల్‌ కావాలని అనుకుందని తెలిపారు. అయితే డ్యాన్స్‌ మీద శ్రద్ధ పెట్టి నేర్చుకుందని, నటనలోనూ ప్రతిభ చూపిస్తుందని అన్నారు. ఈ క్రమంలోనే ఆమె పలు సినిమాల్లోని సన్నివేశాలను కూడా మిమిక్రీలా చేసి చూపిస్తుందని తెలిపారు. ఇక తన కుమార్తెని ఇండస్ట్రీకి ఘనంగా పరిచయం చేయాలని అనుకుంటున్నానని అన్నారు. అందులో భాగంగానే తన స్నేహితుడి కుమారుడు క్రాంతి హీరోగా.. కొత్త రంగు ప్రపంచం అనే సినిమాను నిర్మిస్తున్నారని అన్నారు. అందులో తన కుమార్తె హీరోయిన్ గా నటిస్తుందని తెలిపారు.

Prudhvi Raj daughter Sreelu to debut in film industry
Prudhvi Raj

అయితే ఈ మూవీ షూటింగ్‌ దాదాపుగా పూర్తయిందని.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందని పృథ్వి వివరించారు. ఇక శ్రీ ఆర్పీ క్రియేషన్స్‌ బ్యానర్‌ ఈ మూవీని నిర్మిస్తుందని.. దీన్ని దర్శకుడు అత్యంత ప్రతిభతో తెరకెక్కిస్తున్నాడని.. త్వరలోనే ఈ మూవీ విడుదల కానుందని.. అప్పుడు పూర్తి వివరాలను వెల్లడిస్తామని.. పృథ్వి తెలిపారు. ఇక తనను ఆదరించినట్లే తన కుమార్తెను కూడా ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నానని అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment