KGF 2 : కేజీఎఫ్ 2.. ఇక ఫ్రీగా చూడొచ్చు..!

May 31, 2022 9:43 PM

KGF 2 : తెలుగు సినిమాకు బాహుబ‌లి ఎలాగైతే అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిందో.. అలాగే కేజీఎఫ్ కూడా క‌న్న‌డ సినిమాకు అంత‌ర్జాతీయ స్థాయిలో అలా గుర్తింపును తెచ్చింది. ఈ క్ర‌మంలోనే కేజీఎఫ్ మొద‌టి పార్ట్ 2018లో విడుద‌ల కాగా.. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో రికార్డుల‌ను తిర‌గరాసింది. ఇక మొన్నీ మ‌ధ్యే విడుద‌లైన కేజీఎఫ్ 2 కూడా బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధించి రికార్డుల‌ను కొల్ల‌గొట్టింది.

అయితే కేజీఎఫ్ 2ను అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ చేస్తున్నారు. కానీ దీన్ని చూసేందుకు రూ.199 చెల్లించాల్సి వ‌స్తోంది. పే ప‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో ఈ మూవీని చూడాల్సి వ‌స్తోంది. అయితే ఇక‌పై ఈ మూవీని ఉచితంగానే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ చేయ‌నున్నారు. ఈ మేర‌కు అమెజాన్ ఒక ప్ర‌క‌ట‌న‌ను విడుదల చేసింది. జూన్ 3 నుంచి కేజీఎఫ్ 2 మూవీని అమెజాన్‌లో ఉచితంగా స్ట్రీమ్ చేయ‌నున్నారు. ఇందుకు గాను ఎలాంటి రుసుమును అద‌నంగా చెల్లించాల్సిన ప‌నిలేదు.

KGF 2 now you can watch it for free on Amazon
KGF 2

ఇక కేజీఎఫ్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేసింది. బాలీవుడ్‌లో రూ.400 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. బాహుబ‌లి త‌రువాత ఈ మూవీకే ఉత్త‌రాదిలో అత్య‌ధిక క‌లెక్ష‌న్లు రావ‌డం విశేషం. ఇక ఇందులో య‌ష్ స‌ర‌స‌న శ్రీ‌నిధి శెట్టి హీరోయిన్‌గా నటించ‌గా.. సంజ‌య్ ద‌త్‌, ప్రకాష్ రాజ్‌లు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment