OTT : ఈ వారం ఓటీటీల్లో అలరించనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే..!

May 30, 2022 2:44 PM

OTT : వారం మారిందంటే చాలు.. ఈ వారం ఓటీటీల్లో ఏమేం సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి.. అంటూ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అందులో భాగంగానే ఓటీటీ యాప్ లు కూడా ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, సిరీస్‌లను రిలీజ్‌ చేస్తున్నాయి. ఇక ఈ వారం రిలీజ్‌ కానున్న సినిమాలు, సిరీస్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

విశ్వక్‌సేన్‌, రుక్సార్‌ ధిల్లాన్‌ నటించిన అశోకవనంలో అర్జున కల్యాణం మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే సాధించింది. కానీ థియేటర్లకు ప్రేక్షకులను రప్పించలేకపోయింది. ఇక మూవీ ఓటీటీలో స్ట్రీమ్‌ కానుంది. జూన్‌ 3వ తేదీన ఈ మూవీని ఆహా ప్లాట్‌ఫామ్‌పై విడుదల చేయనున్నారు. ఓటీటీలో ఈ మూవీ హిట్‌ అవుతుందేమో చూడాలి.

movies and series to stream on OTT apps from June 3rd 2022
OTT

మళయాళం స్టార్‌ హీరో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రలో రిలీజ్‌ అయిన జనగణమణ మూవీ ఓటీటీలో స్ట్రీమ్‌ కానుంది. జూన్‌ 2వ తేదీ నుంచి ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ చేయనున్నారు.

నందమూరి తారకరత్న, అజయ్‌, ఇతరులు ప్రధాన పాత్రల్లో నటించిన 9 అవర్స్‌ అనే సిరీస్‌ను జూన్‌ 2వ తేదీ నుంచి స్ట్రీమ్‌ చేయనున్నారు. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్ లో ఈ సిరీస్‌ను వీక్షించవచ్చు. యాక్షన్‌ డ్రామా జోనర్‌లో దీన్ని తెరకెక్కించారు.

ది బాయ్స్‌ అనే సిరీస్‌కు చెందిన 3వ సీజన్‌ ఈ వారం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ కానుంది. ఈ సిరీస్‌ తొలి రెండు సీజన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సిరీస్‌ను జూన్‌ 3వ తేదీ నుంచి స్ట్రీమ్‌ చేయనున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment