Radhika Apte : అలా చేయడం నా వల్ల కాదంటున్న రాధికా ఆప్టే..!

May 30, 2022 11:28 AM

Radhika Apte : రక్త చరిత్ర మొదటి పార్ట్‌ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటీ.. రాధికా ఆప్టే. ఆ తరువాత ఈమెకు తెలుగులో పలు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. వాటిల్లో లెజెండ్‌ మూవీ ఒకటి. ఇది హిట్‌ అయినప్పటికీ రాధికా ఆప్టేకు మళ్లీ ఆఫర్లు రాలేదు. అయినప్పటికీ ఈమె మరాఠీ, బెంగాలీ, హిందీ భాషలకు చెందిన సినిమాల్లో నటిస్తూ వస్తోంది. అయితే గతంలో ఓ చిత్రంలో బోల్డ్‌ సీన్లలో నటించిన ఈ బ్యూటీ సంచలనం సృష్టించింది. ఆ తరువాత ఈమెకు పెద్దగా ఆఫర్లు కూడా రావడం లేదు. అయినప్పటికీ రాధికా ఆప్టే తనకు వచ్చిన ఆఫర్లను కాదనకుండా చేస్తోంది.

ఇక రాధికా ఆప్టే సోషల్‌ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్‌గా ఉండదు. ఈమె గ్లామర్‌ షో కేవలం సినిమాలకే పరిమితం. ఇతర హీరోయిన్లలా సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత చేయదు. కానీ ఫాలోవర్లు మాత్రం ఎక్కువగానే ఉన్నారు. ఇక రాధికా ఆప్టే తాజాగా సర్జరీలు చేయించుకునే హీరోయిన్లపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. కొందరు సర్జరీలు వద్దు అంటూనే చేయించుకుంటారని.. సహజసిద్ధమైన అందం అంటే వారికి నచ్చదని రాధికా కామెంట్స్‌ చేసింది.

Radhika Apte sensational comments on actress
Radhika Apte

కొందరు హీరోయిన్లు తమ శరీరంలో భాగాలను అందంగా కనిపించాలని సర్జరీలు చేయించుకుంటారని.. కానీ అలా చేయడం తన వల్ల కాదని రాధికా ఆప్టే పేర్కొంది. అలాంటి వారిని చూడాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుందని కామెంట్స్‌ చేసింది. అయితే శరీరానికి సర్జరీలు చేయించుకునేవారు చెప్పే మాటలను విని విసిగిపోయానని కూడా ఆమె తెలియజేసింది. కాగా రాధికా ఆప్టే ప్రస్తుతం విక్రమ్‌ వేదా అనే సినిమాలో నటిస్తుండగా ఈ మూవీ షూటింగ్‌ దశలో ఉంది. అలాగే ఈమె నటించిన ఫోరెన్సిక్ అనే మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ స్టేజ్ లో ఉంది. ఇక నెట్ ఫ్లిక్స్‌ నిర్మిస్తున్న మోనికా, ఓ మై డార్లింగ్‌ అనే మూవీలోనూ ఈమె నటిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment