Shraddha Das : కళావతి పాటకు మైమరిచిపోయిన శ్రద్ధా దాస్‌.. వీడియో వైరల్‌..!

May 30, 2022 8:16 AM

Shraddha Das : సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, కీర్తి సురేష్‌ల కాంబినేషన్‌లో వచ్చిన సర్కారు వారి పాట చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శించబడుతూ బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లను వసూలు చేస్తూ ముందుకు సాగుతోంది. ఇక ఈ మూవీ సమాజానికి మెసేజ్‌ ఇచ్చేదిగా ఉండడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు సహజంగానే ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమాలోని అన్ని పాటలు కూడా హిట్‌ అయ్యాయి. ముఖ్యంగా కళావతి సాంగ్‌ ఎంతో మందిని అలరిస్తూ ఇప్పటికీ ట్రెండ్‌ అవుతోంది.

కళావతి సాంగ్‌ ఇప్పటికీ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతూనే ఉంది. ఈ పాటకు ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు, సామాన్యులు డ్యాన్స్‌లు చేసి అలరించారు. ఇక ఈ జాబితాలో శ్రద్ధా దాస్‌ కూడా చేరిపోయింది. కళావతి పాటకు ఆమె డ్యాన్స్‌ అయితే చేయలేదు కానీ.. తన అంద చందాలను చూపిస్తూ యాక్ట్‌ చేసింది. అందరినీ మైమరిచిపోయేలా చేసింది. ఆమె ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేయగా.. అది వైరల్‌ అవుతోంది.

Shraddha Das acted for Kalaavathi song video viral
Shraddha Das

ఇక శ్రద్ధా దాస్‌ సినిమాల విషయానికి వస్తే.. ఈమె లేచింది మహిళా లోకం అనే సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈమె నటించిన కె3 కోటికొక్కడు అనే మూవీ జూన్‌ 17న రిలీజ్‌ కానుంది. వీటితోపాటు ఈమె పలు ఇతర చిత్రాలతోనూ బిజీగా ఉంది. సోషల్‌ మీడియాలోనూ ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈమె అందులో తరచూ తన అందాల ఆరబోత ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది. దీంతో ఈ అమ్మడి అందాలకు యువత ఫిదా అవుతుంటారు.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Das (@shraddhadas43)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment