Mohan Babu : హీరోయిన్‌ను షూటింగ్‌ స్పాట్‌లోనే చెంప చెళ్లుమనిపించిన మోహన్‌బాబు.. అసలేమైంది..?

May 29, 2022 12:36 PM

Mohan Babu : కలెక్షన్‌ కింగ్‌, నట ప్రపూర్ణగా పేరు తెచ్చుకున్న మోహన్‌బాబు ఎప్పుడూ కోపంగా కనిపిస్తుంటారు. ఆయన చీటికీ మాటికీ ఎవరిని పడితే వాళ్లను ఎంత మాట అంటే అంత మాట అనేస్తారని టాక్‌ ఉంది. అందుకనే ఆయన లేదా ఆయన కుమారుల సినిమాల్లో నటించేందుకు నటీనటులు ఆసక్తిని చూపించరట. అయితే వాస్తవానికి మోహన్‌ బాబు ముక్కు సూటిగా మాట్లాడతారు. ఆయన ఉన్నది ఉన్నట్లు ఎలాంటి దాపరికం లేకుండా చెప్పేస్తారు. కనుకనే ఆయనపై అలాంటి ముద్ర పడిపోయిందని తెలుస్తోంది. అయితే మోహన్‌ బాబు అప్పట్లో ఓ హీరోయిన్‌ను షూటింగ్‌ స్పాట్‌లోనే చెంప చెళ్లుమనిపించారు. దీంతో అసలు ఏం జరిగిందనే విషయం చాలా మందికి తెలియదు.

మోహన్‌బాబు అప్పట్లో ఓ హీరోయిన్‌ను షూటింగ్‌ స్పాట్‌లోనే చెంప దెబ్బ కొట్టారన్న వార్త బాగా ప్రచారం అయింది. దీంతో ఆయనను అందరూ నిందించారు. మోహన్‌బాబుకు చాలా అహంకారమని.. అందుకనే ఆ హీరోయిన్‌ పట్ల దురుసుగా ప్రవర్తించి ఉంటారని అనుకున్నారు. కానీ అసలు విషయం వేరే ఉంది. అప్పట్లో మోహన్‌ బాబు కుమారుడు మంచు విష్ణు హీరోగా తొలి సినిమా విష్ణు తీశారు. దీన్ని మోహన్‌ బాబు స్వయంగా తమ బ్యానర్‌ అయిన లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై నిర్మించారు. దీనికి మళయాళ దర్శకుడు షాజీ కైలాస్‌ దర్శకత్వం వహించారు. ఇస్మాయిల్‌ దర్బార్‌ సంగీతం అందించారు. ఇందులో విష్ణుకు జోడీగా అప్పటి హీరోయిన్‌ సాక్షి శివానంద్‌ చెల్లెలు శిల్పా శివానంద్‌ నటించింది. విష్ణు సినిమా ఈమెకు కూడా మొదటి సినిమానే కావడం విశేషం.

Mohan Babu slapped heroine in shooting spot know the reason
Mohan Babu

అయితే శిల్పా శివానంద్‌ షూటింగ్‌కు టైముకు రాకపోయేదట. ఆమెకు ఎన్నో సార్లు చెప్పినా ఆమె పెడచెవిన పెట్టిందట. దీంతోపాటు దర్శకుడు చెప్పింది చేసేందుకు కొన్నిసార్లు అసలు ఒప్పుకోకపోయేదట. దీంతో ఎంత చెప్పినా విననందుకు గాను మోహన్‌ బాబు ఆమెను చెంప దెబ్బ కొట్టారట. దీంతో ఈ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. కానీ దీని వల్ల మోహన్‌బాబుపై బ్యాడ్‌ ఇమేజ్‌ క్రియేట్‌ అయింది. ఈ వార్త అప్పట్లో బాగా ప్రచారం అయింది. దీంతో మోహన్‌బాబు కోపిష్టి అన్న ముద్ర పడిపోయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now