Bhanu Chander : భానుచందర్‌పై అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం.. భారీగా ట్రోలింగ్‌, విమర్శలు..

May 26, 2022 10:05 AM

Bhanu Chander : ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా వచ్చిన పుష్ప మొదటి పార్ట్‌ ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ అయింది. ఈ క్రమంలోనే హిందీ మార్కెట్‌లోనూ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. భారీగా కలెక్షన్లను వసూలు చేసింది. ఇక ఈ మూవీలోని పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బన్నీ వేసిన శ్రీవల్లి స్టెప్‌తోపాటు రష్మిక మందన్న సామి సాంగ్‌.. ఆ తరువాత సమంత నటించిన ఊ అంటావా మావా.. పాట.. బంపర్ హిట్‌ అయ్యాయి. వీటికి ఇప్పటికీ చాలా మంది స్టెప్పులు వేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. సెలబ్రిటీల నుంచి క్రికెటర్ల వరకు పుష్ప తగ్గేదేలే.. డైలాగ్‌ను చెబుతూ అలరిస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి సీనియర్‌ నటుడు భానుచందర్‌ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు.

భానుచందర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పుష్ప గురించి మాట్లాడుతూ.. పుష్ప మూవీలో సమంత ఐటమ్‌ సాంగ్‌ అద్భుతంగా చేసింది. ఆ పాటలో ఇతరులు ఎవరైనా డ్యాన్స్‌ చేసి ఉండవచ్చు. కానీ సమంత డ్యాన్స్‌ చేయడం వల్లే పుష్ప సినిమా అంత పెద్ద హిట్‌ అయింది. సమంత వల్లే ఆ మూవీ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.. అని అన్నారు. దీంతో భానుచందర్‌పై అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Bhanu Chander comments on Allu Arjun his fans angry
Bhanu Chander

వాస్తవానికి సమంత చేసింది ఐటమ్‌ సాంగ్‌ మాత్రమే. ఆమె కాకుండా ఆ పాట ఎవరు చేసినా హిట్‌ అయి ఉండేది. ఎందుకంటే పాట అలాంటిది మరి. ఇక సినిమా మాత్రం అల్లు అర్జున్‌ వల్లే హిట్‌ అయింది. ఆ విషయం ఎవర్ని అడిగినా చెబుతారు. బన్నీ యాక్టింగ్‌ ఇందులో సూపర్బ్‌. అల్లు అర్జున్‌ కాకుండా ఆ పాత్రలో ఇతర ఏ హీరో నటించినా అంత పెద్ద హిట్‌ అయి ఉండేది కాదేమో. అంతలా బన్నీ ఆ పాత్రలో జీవించాడు. సినిమా మొత్తాన్ని తన భుజాలపైనే మోశాడు. అలాంటి కేవలం ఒక్క పాటలో నటిస్తే సమంత వల్లే సినిమా హిట్‌ అయిందని అనడంలో అర్థం లేదు. కనుకనే బన్నీ ఫ్యాన్స్‌కు కోపం వచ్చింది. దీంతో భాను చందర్‌ను తీవ్రంగా విమర్శిస్తూ ట్రోల్‌ చేస్తున్నారు. అయితే దీనిపై భాను చందర్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment