Akira Nandan : కొణిదెల అకీరా నంద‌న్ కాదు.. అకీరా నంద‌న్ దేశాయ్‌.. ప‌వ‌న్ ఫ్యాన్స్ అసంతృప్తి..?

May 26, 2022 7:18 AM

Akira Nandan : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వార‌సుడు అకీరా నంద‌న్ ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్నాడు. ఇటీవ‌లే అకీరా నంద‌న్ బ‌ర్త్ డేను జ‌రుపుకోగా.. త‌న తండ్రికి త‌గిన‌ట్లే అతను ర‌క్త‌దానం చేసి శ‌భాష్ అనిపించుకున్నాడు. అలాగే మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట మూవీలోంచి క‌ళావ‌తి అనే సాంగ్‌ను పియానోపై వాయించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. అకీరానంద‌న్‌లో ఉన్న టాలెంట్ గురించి ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే వారికి మింగుడు ప‌డ‌ని వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేమిటంటే..

ఇటీవ‌ల అకీరానంద‌న్ గ్రాడ్యుయేష‌న్ డే సంద‌ర్భంగా ప‌వ‌న్‌, రేణు దేశాయ్ ఒకే ఫ్రేములో క‌నిపించి అల‌రించారు. దీంతో వారి ఫొటో వైర‌ల్‌గా మారింది. ప‌వ‌న్‌, రేణు దేశాయ్ చాలా రోజుల త‌రువాత ఒకే చోట క‌నిపించ‌డం ఆయ‌న ఫ్యాన్స్‌కు ఎంతో సంతోషాన్నిచ్చింది. కానీ ఆ సంతోషం ఎంతో సేపు నిల‌బ‌డ లేదు. కార‌ణం.. అకీరా నంద‌న్‌కు ప‌వ‌న్ ఇంటి పేరు కొణిదెల పెట్ట‌క‌పోవ‌డ‌మే. అకీరానంద‌న్‌కు త‌న త‌ల్లి ఇంటి పేరు పెట్టారు. అకీరా నంద‌న్ దేశాయ్ గా పెట్టారు. అయితే ఈ విష‌యం గ్రాడ్యుయేష‌న్ డే సంద‌ర్భంగా తీసిన ఓ వీడియో ద్వారా వెల్ల‌డైంది.

Akira Nandan got her mothers surname
Akira Nandan

అకీరా నంద‌న్ గ్రాడ్యుయేష‌న్ డే సంద‌ర్భంగా ఆర్ఆర్ఆర్ మూవీలోని దోస్తీ పాట‌ను అత‌ను పియానోపై వాయించాడు. అయితే ఆ సంద‌ర్భంగా తెర‌పై అకీరా నంద‌న్ దేశాయ్ అని క‌నిపించింది. దీంతో పిక్చ‌ర్ క్లియ‌ర్‌గా అర్థ‌మైంది. అకీరా నంద‌న్‌కు తండ్రి ఇంటి పేరు కొణిదెల పెట్ట‌లేద‌ని.. త‌ల్లి ఇంటి పేరు వ‌చ్చే విధంగా దేశాయ్ అని పెట్ట‌డం జ‌రిగింద‌ని.. స్ప‌ష్ట‌మైంది. దీంత ప‌వ‌న్ ఫ్యాన్స్ అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే వాస్త‌వానికి ప‌వ‌న్‌.. రేణుకు విడాకులు ఇచ్చిన‌ప్ప‌టి నుంచి అకీరా, ఆద్య‌లు ఆమె ద‌గ్గ‌రే పెరుగుతున్నారు. అప్పుడ‌ప్పుడు ప‌వ‌న్‌ను క‌లిసేందుకు అకీరా వెళ్తుంటాడు. క‌నుక రేణు ఇంటి పేరునే అకీరాకు పెట్టార‌ని అర్థం చేసుకోవ‌చ్చు. ఏది ఏమైనా ఈ విష‌యం ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు మాత్రం కాస్త అసంతృప్తిని క‌లిగిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now