Tamannaah : త‌మ‌న్నా అలిగిందా ? ఎవ‌రి మీద‌..?

May 25, 2022 9:05 AM

Tamannaah : అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో.. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్‌, త‌మ‌న్నా, మెహ్రీన్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో వ‌స్తున్న మూవీ ఎఫ్‌3. ఎఫ్2 మూవీకి సీక్వెల్‌గా ఈ మూవీని తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన ట్రైల‌ర్‌, పాట‌లు ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ చిత్రాన్ని ఈ నెల 27వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఇక చిత్ర ప్ర‌మోష‌న్స్‌ను కూడా వేగంగా నిర్వ‌హిస్తున్నారు. అయితే ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో త‌మ‌న్నా త‌ప్ప అంద‌రూ క‌నిపిస్తున్నారు. కానీ ఆమె క‌నిపించక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఎఫ్3 మూవీ ప్ర‌మోష‌న్స్‌లో త‌మ‌న్నా కనిపించ‌డం లేదు. అయితే ఆమె కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ఉంది కదా.. అని అనుకోవ‌చ్చు. కానీ ప్ర‌మోష‌న్ చేయ‌ద‌లిస్తే ఆమె సోష‌ల్ మీడియాలో అయినా స‌రే చిన్న వీడియో బిట్‌ను రిలీజ్ చేసి ఉండ‌వ‌చ్చు. కానీ త‌మ‌న్నా క‌నీసం ఆ ప‌ని కూడా చేయ‌డం లేదు. అంటే చిత్ర యూనిట్‌కు, త‌మ‌న్నాకు మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌లు వ‌చ్చాయ‌ని.. క‌నుక‌నే ఆమె చిత్ర ప్ర‌మోష‌న్స్ చేయ‌డం లేద‌ని తెలుస్తోంది.

Tamannaah angry on F3 movie team
Tamannaah

అయితే ఈ వార్త‌ల‌ను చిత్ర యూనిట్ ఖండించింది. అలాంటిదేమీ లేద‌ని.. ఆమె కేన్స్ ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ఉంద‌ని.. అందుక‌నే ఇక్క‌డికి రావ‌డానికి.. ప్ర‌మోష‌న్స్ చేయడానికి వీలు క‌ల‌గ‌డం లేద‌ని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. అయిన‌ప్ప‌టికీ ఆమె క‌నీసం సోష‌ల్ మీడియాలో అయినా ప్ర‌మోష‌న్ చేయ‌వ‌చ్చు క‌దా.. అంత స‌మ‌యం కూడా ఆమెకు లేదా.. అన్న ప్ర‌శ్న‌కు మాత్రం చిత్ర యూనిట్ ఎలాంటి స‌మాధానం చెప్ప‌లేదు. ఈ క్రమంలోనే ఎఫ్3 యూనిట్‌కు, త‌మ‌న్నాకు మ‌ధ్య వ్య‌వ‌హారం బెడిసికొట్టింద‌నే వార్త‌లు నిజ‌మేన‌ని అంటున్నారు. క‌నుక‌నే ఆమె అస‌లు క‌నీసం సోష‌ల్ మీడియాలోనైనా ఎఫ్3 మూవీ గురించి ప్ర‌మోష‌న్ చేయ‌డం లేద‌ని అంటున్నారు. ఇక ఈ వార్త‌ల్లో నిజం ఎంత ఉంది.. అనే విషయం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now