NTR : తీవ్రంగా హర్ట్‌ అయిన ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌.. మంత్రి అంబటి రాంబాబు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్‌..!

May 24, 2022 7:21 PM

NTR : అప్పట్లో చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలని చెప్పి ఎన్‌టీఆర్‌ ప్రత్యక్షంగా రాజకీయాల్లో పాల్గొని ఆయన కోసం ప్రచారం చేశారు. కానీ అప్పటి నుంచి ఎన్‌టీఆర్‌ అసలు రాజకీయాల వైపు చూడడం లేదు. టీడీపీ నాయకులు కొందరు ఎన్నిసార్లు ఎన్‌టీఆర్‌ను రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించినా.. ఈ విషయంపై మాత్రం ఆయన స్పందించడం లేదు. అయితే ఎన్‌టీఆర్‌ను మాత్రం కొందరు రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యల కారణంగా ఆయనను ఎన్‌టీఆర్‌ ఫ్యాన్స్‌ తీవ్రంగా విమర్శిస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగింది.. అన్న విషయానికి వస్తే..

ఇటీవల ఏపీలో హత్య కేసులో అరెస్టు అయిన ఎమ్మెల్సీ అనంత బాబును ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు ప్రెస్‌మీట్‌ పెట్టారు. అందులో ఆయన మాట్లాడుతూ.. తప్పు చేస్తే ఎవరైనా ఒక్కటే, చట్టానికి ఎవరూ అతీతులు కాదు, సీఎం జగన్‌ ఈ విషయమై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా చట్టం ముందు ఒక్కటే. దీనిపై రాజకీయాలు చేయడం సరికాదు.. అని అంబటి అన్నారు. అలాగే జూనియర్‌ ఎన్‌టీఆర్‌, బోనియర్‌ ఎన్‌టీఆర్‌ వస్తే బాగుండని టీడీపీ నేతలు అనుకుంటున్నారు, కానీ ఎవరు వచ్చినా సీఎం జగన్‌ను ఆపడం, అడ్డుకోవడం ఎవరి వల్లా కాదు.. అని అంబటి స్పష్టం చేశారు. అయితే ఈ వివాదంలోకి ఎన్‌టీఆర్‌ను లాగడం, అలాగే ఆయనను విమర్శించడంపై ఆయన ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి అంబటి రాంబాబును వారు విమర్శిస్తూ పెద్ద ఎత్తున ట్రోల్‌ చేస్తున్నారు.

NTR fans hurt for minister Ambati Rambabu comments
NTR

ఎన్‌టీఆర్‌కు సంబంధం లేని విషయంలో ఆయనను ఇలా లాగడం ఎందుకని ఎన్‌టీఆర్‌ ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో మంత్రి అంబటి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే దీనిపై మంత్రి అంబటి రాంబాబు స్పందించాల్సి ఉంది. ఆయన ఏమంటారు.. దీనిని సమర్థించుకుంటారా.. అన్నది తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now