Jabardasth : జ‌బ‌ర్ద‌స్త్‌కు ఊహించ‌ని షాక్‌..? సుధీర్‌, ఆది, శ్రీ‌ను అవుట్‌..?

May 22, 2022 5:20 PM

Jabardasth : బుల్లితెర‌పై ప్ర‌సారం అవుతున్న టీవీ షోల‌లో జ‌బ‌ర్ద‌స్త్‌కు ఎంత పేరు ఉందో అంద‌రికీ తెలిసిందే. ఈ షో ఎన్నో ఏళ్ల నుంచి అప్ర‌తిహ‌తంగా కొన‌సాగుతూనే వ‌స్తోంది. అప్ప‌ట్లో ఉన్న క‌మెడియ‌న్ల స్థానంలో కొత్త‌వారు వ‌చ్చి చేరారు. జ‌డ్జిలు మారిపోయారు. కానీ ఈ షోకు ఉన్న ఆద‌ర‌ణ మాత్రం త‌గ్గ‌డం లేదు. అయితే ఈ షో నిర్వాహ‌కుల‌కు ఊహించ‌ని షాక్ త‌గిలిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో ప్ర‌ధాన క‌మెడియ‌న్లుగా ఉన్న సుధీర్‌, ఆది, శ్రీ‌నులు ఈ షోకు గుడ్ బై చెప్పార‌ని.. ఇక వారు తిరిగి రార‌ని తెలుస్తోంది.

అయితే ఈ ముగ్గురూ ఆశ్చ‌ర్యంగా శ్రీ‌దేవి డ్రామా కంపెనీ అనే షోలో మాత్రం కొన‌సాగుతున్నారు. కానీ జ‌బ‌ర్ద‌స్త్ లో క‌నిపించ‌డం లేదు. ఇక త్వ‌ర‌లోనే ఆ డ్రామా కంపెనీ షోకు కూడా గుడ్‌బై చెప్ప‌నున్నార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే వీరికి స్టార్ మా వారు భారీ మొత్తంలో రెమ్యున‌రేష‌న్‌ను ఆఫ‌ర్ చేసిన‌ట్లు కూడా తెలుస్తోంది. వీరికి భారీ మొత్తంలో టోకెన్ అడ్వాన్స్ కూడా ఇస్తామ‌ని చెప్పార‌ట‌. అయితే ఇందుకు వారు ఓకే చెప్పారా.. లేదా.. అనేది తెలియాల్సి ఉంది. ఓకే గ‌న‌క చెప్పి ఉంటే జ‌బ‌ర్ద‌స్త్‌తోపాటు డ్రామా కంపెనీ షోకు కూడా ఊహించ‌ని షాక్ త‌గిలిన‌ట్లే అని అంటున్నారు. ఎందుకంటే జ‌డ్జిలు ఎవ‌రు వ‌చ్చినా స‌రే.. అక్క‌డ షోలో స్కిట్లు చేసే వారికే ప్రాధాన్య‌త ఎక్కువ‌గా ఉంటుంది. ఈ క్ర‌మంలోనే సుధీర్‌, ఆది, శ్రీ‌నులు మంచి క‌మెడియ‌న్లు అని చెప్ప‌వచ్చు. షోల‌లో వీరి స్కిట్ల‌కే ఎక్కువ వ్యూస్ వ‌స్తుంటాయి. అలాంటిది వీరు ఆ షోల‌కు దూర‌మైతే ఇక వాటికి ఆద‌ర‌ణ త‌గ్గుతుంద‌నే అంటున్నారు.

Jabardasth  Sudheer and Aadi and Sreenu out
Jabardasth

అయితే ఆయా షోల‌కు వీరు ఎందుకు గుడ్ బై చెబుతున్నారు.. అనే కార‌ణాలు మాత్రం తెలియ‌దు కానీ.. ఇక‌పై వాటిలో కొన‌సాగ‌లేమ‌ని చెప్పేశార‌ట‌. ఈ క్ర‌మంలోనే జ‌బ‌ర్ద‌స్త్ తాజా ఎపిసోడ్‌లో రామ్ ప్ర‌సాద్ ఒక్క‌డే క‌నిపించాడు. త‌న ఇద్ద‌రు టీమ్ మేట్స్ లేక‌పోవ‌డం బాధ‌గా ఉంద‌ని రామ్‌ప్ర‌సాద్ అన్నాడు. అయితే అత‌ను అందులోనే ఉంటాడా.. త‌మ తోటి టీమ్ మేట్ల‌తో అత‌ను కూడా గుడ్ బై చెప్పి బ‌య‌ట‌కు వ‌స్తాడా.. అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా.. నాగ‌బాబు దూరం అయ్యాక మొన్న రోజా ఈ షోకు గుడ్ బై చెప్పేశారు. త‌రువాత క‌మెడియ‌న్లు కూడా ఒక్కొక్క‌రుగా వెళ్లిపోతున్నారు. దీంతో ఆయా షోల నిర్వ‌హ‌ణ‌పై నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఇక ఈ విష‌యంలో రానున్న రోజుల్లో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now