Anchor Suma : బండ్ల గ‌ణేష్‌ను అడ్డుకున్న‌ట్లే.. న‌న్నూ అడ్డుకుంటున్నారు.. సుమ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

May 21, 2022 10:10 PM

Anchor Suma : విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా హీరో వ‌రుణ్ తేజ్ లు న‌టించిన మ‌ల్టీ స్టార‌ర్ మూవీ ఎఫ్‌3. ఎఫ్2కు సీక్వెల్‌గా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు. అయితే ఈ సినిమా ఈ నెల 27వ తేదీన విడుద‌ల కానుండ‌గా.. సినిమాకు సంబంధించి శ‌నివారం (మే 21) చాలా గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన సుమ త‌న పంచ్‌లు, తెలంగాణ యాస‌తో అద‌ర‌గొట్టింది.

ఇక ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సుమ‌.. మూవీ కామెడీ మూవీ క‌నుక స‌హజంగానే ఫ‌న్నీ మాట‌లు మాట్లాడుతూ అల‌రించింది. అయితే ఈ ఈవెంట్‌లో సుమ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. గ‌తంలో నిర్మాత బండ్ల గ‌ణేష్ అన్న‌ట్లుగా ఒక వాయిస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే క‌దా. ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌న‌ను భీమ్లా నాయ‌క్ ఈవెంట్‌కు హాజ‌రు కాకుండా అడ్డుకున్నాడు.. అని ఆ వాయిస్‌లో ఉంది. అది అచ్చం బండ్ల గ‌ణేష్ వాయిస్‌ను పోలి ఉంది. దీంతో ఆయ‌నే ఆ వ్యాఖ్య‌లు చేశాడ‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ తాను ఆ కామెంట్స్ చేయ‌లేద‌ని ఆయ‌న త‌రువాత స్ప‌ష్ట‌త ఇచ్చారు. అయితే భీమ్లా నాయ‌క్ ఈవెంట్‌కు రాకుండా బండ్ల గ‌ణేష్‌ను ఏ విధంగా అయితే అడ్డుకున్నారో.. అలాగే త‌న‌ను ఎఫ్3 ఈవెంట్‌కు రాకుండా కొంద‌రు అడ్డుకున్నారు.. అంటూ సుమ కామెంట్స్ చేసింది.

Anchor Suma said she was stopped like Bandla Ganesh
Anchor Suma

అయితే ఆమె కావాల‌నే ఆ కామెంట్స్ చేసిందా.. లేక‌.. నిజంగానే త‌న‌ను ఎఫ్‌3 ఈవెంట్‌కు రాకుండా ఎవ‌రైనా అడ్డుకున్నారా.. అన్న విష‌యం తెలియాల్సి ఉంది. ఈ మ‌ధ్య కాలంలో దాదాపుగా ప్ర‌తి ఒక్క సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సుమ‌నే వ్యాఖ్యాత‌గా మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తోంది. క‌నుక ఆమె ప‌ట్ల యాంక‌ర్ల లోకం కాస్త గుర్రుగా ఉన్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. క‌నుక‌నే సుమ ఈ విధంగా వ్యాఖ్య‌లు చేసిందా.. అని అనుకుంటున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్ట‌హాసంగా ముగియ‌గా.. సినిమా బంప‌ర్ హిట్ ఖాయ‌మ‌ని.. చిత్ర యూనిట్ చెబుతోంది. అలాగే టిక్కెట్ల రేట్ల‌ను కూడా పెంచ‌లేదు క‌నుక ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌స్తార‌నే ఆశిస్తున్నారు. మ‌రి ఈ విష‌యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now