Akhanda : అఖండ 2 గురించి అప్ డేట్‌.. ఫ్యాన్స్ కు పూన‌కాలే..!

May 21, 2022 5:00 PM

Akhanda : నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయపాటి శ్రీ‌నుల‌ది ఎంత‌టి స‌క్సెస్ కాంబినేష‌నో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. వీరు క‌ల‌సి చేసిన మూవీలు హిట్ అయ్యాయి. ఈ క్ర‌మంలోనే వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అఖండ భారీ విజ‌యాన్ని సాధించింది. క‌రోనా త‌రువాత ఎలాంటి అంచ‌నాలు లేకుండానే థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ మూవీ ఏకంగా రూ.125 కోట్ల‌ను రాబ‌ట్టింది. అయితే ఈ మూవీ చివ‌ర్లో అప్ప‌ట్లోనే దీనికి సీక్వెల్ ఉంటుంద‌ని.. బోయ‌పాటి హింట్ ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం ఆయ‌న అఖండ 2 కోసం ప‌నిచేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అఖండ రిలీజ్ స‌మ‌యంలోనే అఖండ 2 ఉంటుంద‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే బోయ‌పాటి ప్ర‌స్తుతం అఖండ సీక్వెల్‌కు క‌థ‌ను సిద్ధం చేస్తున్నార‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి బాల‌కృష్ణ‌తో బోయ‌పాటి పొలిటిక‌ల్ నేప‌థ్యంలో ఓ మూవీని తీయాల్సి ఉంది. దీన్ని వ‌చ్చే ఎన్నిక‌ల‌కు విడుద‌ల చేద్దామ‌ని భావించారు. కానీ అఖండకు వ‌చ్చిన క్రేజ్ దృష్ట్యా దీన్నే ముందు తీస్తున్న‌ట్లు చెప్పారు. ఇక ఈ మూవీకి ప్ర‌స్తుతం క‌థ‌ను సిద్ధం చేస్తుండ‌గా.. బాల‌కృష్ణ ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నారు. ఇది ముగిశాక అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా ఉంటుంది. ఆ త‌రువాతే అఖండ 2 లాంచ్ అవుతుంది. అయితే బాల‌కృష్ణ సినిమాలు చేసేందుకు పెద్ద‌గా స‌మ‌యం తీసుకోరు. క‌నుక ఇంకో ఏడాదిలోనే అఖండ 2 వ‌స్తుంద‌ని ఆశించ‌వ‌చ్చు.

update on Akhanda 2 movie fans will be happy
Akhanda

ఇక అఖండ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌. క‌నుక‌నే అఖండ నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ మూవీకి భారీగా బ‌డ్జెట్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఇక క‌థ కూడా పూర్తిగా అఘోరాల మీదే ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇదే నిజ‌మైతే ఈ మూవీ ఇండియ‌న్ బాక్సాఫీస్ రికార్డుల‌ను షేక్ చేస్తుంద‌ని అంటున్నారు. ఇక అఖండ 2 అప్‌డేట్ కోసం ఫ్యాన్స్ కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రి దీనిపై అప్‌డేట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment