Venkatesh : ఎఫ్3 సినిమాకు గాను వెంక‌టేష్ అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా ?

May 20, 2022 9:35 PM

Venkatesh : తెలుగు సినీ ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఎదురు చూస్తున్న సినిమా ఎఫ్ 3. మ‌ల్టీ స్టార‌ర్ గా తెర‌క్కెకిన ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన విడుద‌ల చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఎఫ్ 2 కి స్వీకెల్ గా నిర్మించిన ఈ సినిమాలో వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్ హీరోలుగా న‌టించారు. ఫుల్ లెంగ్త్‌ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. అయితే ఈ సినిమాకు గాను వెంక‌టేష్ భారీ మొత్తంలో రెమ్యూన‌రేష‌న్ తీసుకున్నార‌ని సినీ ఇండ‌స్ట్రీలో టాక్ న‌డుస్తోంది.

వెంక‌టేష్ ఎఫ్3 సినిమాకి గాను 15 కోట్ల రూపాయ‌ల‌ను రెమ్యూన‌రేష‌న్ గా తీసుకున్నార‌ని స‌మాచారం. త‌న కెరీర్ లో వెంక‌టేష్ ఇంత ఎక్కువ రెమ్యూన‌రేష‌న్ ను ఏ సినిమాకు తీసుకోలేద‌ట‌. సినిమాలో మ‌నం వెంక‌టేష్ ను రేచీక‌టి ఉన్న వ్య‌క్తిలా చూడ‌వ‌చ్చ‌ని స‌మాచారం.

do you know how much Venkatesh took for F3 movie
Venkatesh

ఇక ఈ సినిమాను దిల్ రాజు నిర్మించ‌గా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన పాటలు, ట్రైల‌ర్, టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. త‌మ‌న్నా, మెహ‌రీన్ హీరోయిన్స్ గా న‌టించిన ఈ సినిమా భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల కానుంది. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను ఏవిధంగా ఆక‌ట్టుకుంటుందో చూడాలి. ఇక సినిమా టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచితే ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం లేద‌ని గ్ర‌హించిన దిల్ రాజు ఈ మూవీకి టిక్కెట్ల ధ‌ర‌ల‌ను పెంచ‌డం లేద‌ని చెప్పారు. అయితే మ‌రి ఈ మూవీకి తొలి రోజు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now