Niharika Konidela : భ‌ర్త‌తో నిహారిక లిప్‌లాక్‌.. మెగా ఫ్యామిలీ ప‌రువు తీస్తున్నావంటూ నెటిజ‌న్ల ఆగ్ర‌హం..!

May 19, 2022 10:08 AM

Niharika Konidela : మెగా డాట‌ర్ కొణిదెల నిహారిక త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఈ మ‌ధ్య కాలంలో ఈమె ఎక్కువ యాక్టివ్‌గా ఉంటోంది. ప‌బ్‌లో డ్ర‌గ్స్ కేసు నేప‌థ్యంలో నిహారిక పేరు బాగా విన‌బ‌డింది. దీంతో కొన్ని రోజుల పాటు ఈమె బ‌య‌ట‌కు రాలేదు. త‌రువాత మ‌ళ్లీ డీయాక్టివేట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను యాక్టివేట్ చేసి.. తాను పాఠాలు నేర్చుకున్నాన‌ని చెబుతూ.. అందులో మ‌ళ్లీ పోస్ట్‌లు పెట్ట‌సాగింది. ఇక ఈ మ‌ధ్యే ఈమె భ‌ర్త చైత‌న్య‌తో క‌లిసి జోర్డాన్‌కు వెకేష‌న్‌కు వెళ్లి వ‌చ్చింది. అక్క‌డ వీరు తీసుకున్న ఫొటోల‌ను ఈమె షేర్ చేసింది. అయితే తాజ‌గా నిహారిక నెటిజ‌న్ల‌కు షాకిచ్చింది. భ‌ర్త‌కు లిప్ లాప్ ఇస్తూ తీసుకున్న ఫొటోను ఆమె షేర్ చేసింది. దీంతో ఈ ఫొటో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.

నిహారిక త‌న భ‌ర్త‌కు లిప్‌లాక్ ఇస్తూ తాజా ఫొటోలో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఆ ఫొటోను కాస్త బ్ల‌ర్ చేసి పోస్ట్ చేసింది. అయితే ఇంత స‌డెన్ గా ఈమె ఇలాంటి ఫొటోను ఎందుకు షేర్ చేసిందబ్బా..? అని ఆలోచిస్తే.. అందుకు ఓ బ‌ల‌మైన కార‌ణం కూడా క‌నిపిస్తోంది. అదేమిటంటే.. నిహారిక గ‌తంలో జిమ్ ట్రెయిన‌ర్‌తో చ‌నువుగా ఉంది క‌దా. ఆ స‌మ‌యంలో ఆమె అత‌ని వీపు మీద కూర్చుని ఓ వీడియోను కూడా తీసుకుంది. దాన్ని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే ఆ వీడియో కార‌ణంగా అత్తింటి వారు ఆమెను తిట్టార‌ట‌. దీంతో ఆమె అలిగి ఇన్‌స్టా ఖాతాను డీయాక్టివేట్ చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

netizen angry on Niharika Konidela for her latest post
Niharika Konidela

ఇక ఆ వీడియో కార‌ణంగానే చైత‌న్య‌కు, నిహారిక‌కు మ‌ధ్య మ‌న‌స్ఫ‌ర్థ‌లు వ‌చ్చాయ‌ని.. దీంతో వారు విడిపోతార‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. కానీ కుటుంబ స‌భ్యులు వారు ఇద్ద‌రినీ కూర్చోబెట్టి న‌చ్చ‌జెప్పార‌ట‌. అయితే వారి విడాకుల విష‌యం మాత్రం బాగా ప్ర‌చారం అయింది. ఇక నిహారిక ప‌బ్‌లో ఒంట‌రిగా క‌నిపించ‌డంతో ఆ అనుమానాలు మ‌రింత బ‌లప‌డ్డాయి. ఆమె భ‌ర్త‌తో అంత చ‌నువుగా ఉండ‌డం లేద‌ని.. వార్త‌లు వ‌చ్చాయి. కానీ వాట‌న్నింటికీ చెక్ పెట్ట‌డం కోస‌మే నిహారిక ఇలా లిప్‌లాక్ ఫొటోను షేర్ చేసింద‌ని అంటున్నారు. తాము ఎంతో అన్యోన్యంగా ఉన్నామ‌ని, విడాకుల విష‌య‌మే లేద‌ని.. ఇన్‌డైరెక్ట్‌గా ప‌బ్లిక్‌కు చెప్ప‌డం కోస‌మే.. నిహారిక ఇలా లిప్‌లాక్ ఫొటోను షేర్ చేసింద‌ని అంటున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Niharika JV???? (@konidela_niharika_)

ఇక నిహారిక ఫొటోపై మిశ్ర‌మ స్పంద‌న ల‌భిస్తోంది. ఆమెపై కొంద‌రు పాజిటివ్‌గా కామెంట్లు చేస్తుండ‌గా.. కొంద‌రు మాత్రం నెగెటివ్‌గా స్పందిస్తున్నారు. మెగా ఫ్యామిలీ ప‌రువు తీస్తున్నావ‌ని.. ఇలాంటి ఫొటోలు పెట్ట‌డం అవ‌స‌ర‌మా.. అని.. అస‌లు ప‌బ్లిగ్గా ఇలా చేయ‌డం ఎందుకు.. ప్రైవేట్ లైఫ్ లేదా.. అంటూ.. ర‌క‌ర‌కాలుగా ఆమెను ట్రోల్ చేస్తూ విమ‌ర్శిస్తున్నారు. అయితే నిహారిక మాత్రం కొత్త స్టైల్‌లో త్వ‌ర‌లో ముందుకు వ‌స్తాన‌ని చెప్పింది. దీంతో ఆమె ఓ ట్రావెల్ షో చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇక ఇందులో నిజం ఎంత ఉంది.. అనే విష‌యం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now