Tamannaah : మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. అందాల‌ను వ‌ర్ణించ‌త‌ర‌మా..!

May 17, 2022 9:00 PM

Tamannaah : హీరోయిన్లు ఎంద‌రు ఉన్నా.. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా అంద‌మే వేరు. ఈ అమ్మ‌డు సినిమా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 10 ఏళ్ల‌కు పైగానే అవుతోంది. చాలా కాలం నుంచి ఈమె ఇండ‌స్ట్రీలో ఉన్నా ఆఫ‌ర్లు అయితే ఏమాత్రం త‌గ్గ‌డం లేదు. ఇప్ప‌టికీ వ‌రుస సినిమాల‌తో ఈమె బిజీగానే ఉంది. ఇక ఈమె న‌టించిన‌.. న‌టిస్తున్న సినిమాలు రానున్న రోజుల్లో విడుద‌ల కానున్నాయి. దీంతో ఆ చిత్రాల‌కు ప్ర‌మోష‌న్ చేసుకునేందుకు గాను త‌మ‌న్నా ఎప్ప‌టిక‌ప్పుడు గ్లామ‌ర్ షో చేస్తూనే ఉంది. అందులో భాగంగానే తాజాగా మ‌రోమారు ఈ ముద్దుగుమ్మ అందాల‌ను ఆర‌బోసింది.

అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఎఫ్2కు సీక్వెల్‌గా వ‌స్తున్న ఎఫ్‌3 మూవీ ఈ నెల 27వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే ఆచార్య‌, రాధేశ్యామ్‌, స‌ర్కారు వారిపాట చిత్రాల‌కు టిక్కెట్ల రేట్ల‌ను పెంచారు. దీని వ‌ల్ల తొలి రోజే చాలా వ‌ర‌కు థియేట‌ర్లు ఖాళీగా క‌నిపించాయి. ఈ క్ర‌మంలోనే అలాంటి ప‌రిస్థితి వ‌ద్ద‌ని చెప్పి నిర్మాత దిల్ రాజు ఈ మూవీని ఎలాంటి టిక్కెట్ల రేట్లు పెంచ‌కుండానే రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని అంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. సినిమా ప‌క్కా ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తుంద‌ని తెలుస్తోంది. దీంతో ఎఫ్‌3ని చూసేందుకు ప్రేక్ష‌కులు సైతం ఆస‌క్తిని చూపిస్తున్నారు.

Tamannaah at F3 movie promotion
Tamannaah

ఈ మూవీలో త‌మ‌న్నా వెంక‌టేష్‌కు జోడీగా న‌టించ‌గా.. మెహ్రీన్ వ‌రుణ్ తేజ్ ప‌క్క‌న న‌టించింది. ఈ సినిమాలో క‌మెడియ‌న్లు అంద‌రూ ఉన్నారు. దీంతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు ఈ మూవీ సిద్ధ‌మ‌వుతోంది. ఇక ఈ చిత్ర ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా త‌మ‌న్నా ఇప్ప‌టికే ప‌లుమార్లు గ్లామ‌ర్ షోతో ద‌ర్శ‌న‌మిచ్చింది. అందులో భాగంగానే తాజాగా మ‌రోమారు ఈ అమ్మ‌డు ఇచ్చిన పోజులు మ‌తులు పోగొడుతున్నాయి. ఇక ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now