Sreemukhi : యాంక‌ర్ శ్రీ‌ముఖిపై విరుచుకు ప‌డుతున్న నెటిజ‌న్లు.. డ‌బ్బుల కోసం ఏదైనా చేస్తావా ? అని కామెంట్స్‌..!

May 16, 2022 9:42 AM

Sreemukhi : బుల్లితెర‌పై ఎంతో సంద‌డి చేసే యాంక‌ర్ ఎవ‌రు.. అనే విష‌యానికి వ‌స్తే.. మ‌న‌కు ముందుగా గుర్తుకు వ‌చ్చే పేర్ల‌లో యాంక‌ర్ శ్రీ‌ముఖి పేరు త‌ప్ప‌కుండా ఉంటుంది. ఈమె అనేక టీవీ షోల‌ను చేస్తూ బిజీగా ఉంది. అలాగే మ‌రోవైపు సినిమాల్లోనూ న‌టిస్తోంది. అయితే ఈ అమ్మ‌డు తాజాగా నెటిజ‌న్ల ట్రోలింగ్‌కు గుర‌వుతోంది. ఈమె చేసిన ఒక ప‌ని వ‌ల్ల నెటిజ‌న్లు భారీగా ఆమెను విమ‌ర్శిస్తున్నారు. డ‌బ్బులు ఇస్తే ఏ ప‌ని అయినా చేస్తావా.. అంటూ శ్రీ‌ముఖిని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో ఈ విష‌యం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే..

ప్ర‌స్తుతం మ‌న‌కు అనేక ర‌కాల యాప్స్ ఫోన్ల‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో బెట్టింగ్ యాప్స్ ఒక‌టి. ఇవి మ‌న‌ల్ని ఎంతో ఆక‌ర్షిస్తుంటాయి. కానీ వాటిని న‌మ్మి వాటిలో డ‌బ్బు పెడితే.. ఉన్న‌దంతా ఊడ్చేస్తారు త‌ప్ప ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఇలాంటి యాప్స్ బారిన ప‌డి చాలా మంది జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్నారు. కొంద‌రు ప్రాణాల‌ను కోల్పోగా.. కొంద‌రు తీవ్ర‌మైన ఆర్థిక స‌మ‌స్య‌ల్లో చిక్కుకుపోతున్నారు. అయితే ఇలాంటి యాప్స్‌ను కొంద‌రు సెల‌బ్రిటీలు ప్ర‌మోట్ చేసి చిక్కుల్లో ప‌డుతున్నారు. తాజాగా అలాంటి ప‌రిస్థితే యాంక‌ర్ శ్రీ‌ముఖికి ఎదుర‌వుతోంది. ఆమె కూడా బెట్టింగ్ యాప్స్‌ను ప్ర‌మోట్ చేస్తూ త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అయితే దీనిపై నెటిజ‌న్లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. శ్రీ‌ముఖిని దారుణంగా విమ‌ర్శిస్తున్నారు.

netizen troll Anchor Sreemukhi  for promoting apps
Sreemukhi

శ్రీ‌ముఖి.. నీకు అస‌లు సిగ్గుందా.. డ‌బ్బులు ఇస్తే ఎలాంటి ప‌ని అయినా చేస్తావా.. నిన్ను యాంక‌ర్‌గా ఎంతో అభిమానిస్తున్నాం.. కానీ నువ్వు చేస్తున్న‌దేమిటి ? ఇలా బెట్టింగ్ యాప్‌ల‌ను ఎందుకు ప్రోత్స‌హిస్తున్నావు ? వాటిని ఇన్‌స్టాల్ చేసుకోవాల‌ని మాకు ఎందుకు చెబుతున్నావు ? వాటిని ఎందుకు ప్ర‌మోట్ చేస్తున్నావు ? అంటూ శ్రీ‌ముఖిపై నెటిజ‌న్లు విరుచుకుప‌డుతున్నారు. ఆమెను భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అయితే దీనిపై శ్రీ‌ముఖి స్పందించాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now