Karate Kalyani : క‌రాటే క‌ల్యాణికి భారీ షాక్‌.. ఇంట్లో సోదాలు..!

May 15, 2022 10:18 PM

Karate Kalyani : న‌టి క‌రాటే క‌ల్యాణి ఎర‌క్క‌పోయి స‌మ‌స్య‌ల్లో చిక్కుకుందా.. అంటే.. అందుకు అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ఆమె చెప్పిన‌ట్లు ఆమె ఉద్దేశం స‌రైందే అయిన‌ప్ప‌టికీ క‌త్తికి రెండు వైపులా ప‌దును ఉంటుంది అన్న‌ట్లు క‌ల్యాణికి చెందిన ఇంకో వైపును కూడా ప‌రీక్షిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె ద‌గ్గ‌ర పెంచుకుంటున్న బిడ్డను ఆమె కొనుగోలు చేసిందా.. చ‌ట్ట ప్రకారం దత్త‌త తీసుకుందా.. అనే కోణంలో అధికారులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే వారు ఆదివారం ఆమె ఇంట్లో అక‌స్మాత్తుగా సోదాలు నిర్వ‌హించారు.

క‌రాటే కల్యాణి ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వ‌హించి ఆమె పెంచుకుంటున్న బిడ్డ‌ను ఆమె కొనుగోలు చేసిందా.. లేక ద‌త్త‌త తీసుకుందా.. తీసుకుంటే అందుకు సంబంధించిన ప‌త్రాలు ఏమైనా ఉన్నాయా.. అనే కోణంలో వారు ఆరాలు తీశారు. దీంతో ఈ విష‌యం చిలికి చిలికి గాలి వాన‌గా మారుతుంద‌ని తెలుస్తోంది. అయితే ఈ విష‌యంపై క‌ల్యాణి త‌ల్లి విజయ‌ల‌క్ష్మి స్పందించారు. ఈ క్ర‌మంలోనే ఆమె మాట్లాడుతూ క‌ల్యాణి ఎలాంటి త‌ప్పు చేయలేద‌ని.. ఆ బిడ్డ‌ను ఆమె దత్త‌త తీసుకుంద‌ని.. అందుకు సంబంధించిన ప‌త్రాల‌న్నీ ఉన్నాయ‌ని అన్నారు.

officials investigating Karate Kalyani house
Karate Kalyani

ఇక ఆమె ఇప్ప‌టికే 12 ఏళ్ల అబ్బాయిని పెంచుతుంద‌ని.. అందులో భాగంగానే ఇంకో బిడ్డ‌ను ద‌త్త‌త తీసుకుంద‌ని విజ‌య‌ల‌క్ష్మి చెప్పారు. డిసెంబ‌ర్ 25న ఆ ఆడ శిశువు జ‌న్మించ‌గా.. ఆమెను 28వ తేదీన ద‌త్త‌త తీసుకుంద‌ని తెలిపారు. అంతేకానీ త‌న కుమార్తె ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌ని అన్నారు. అయితే ప్రాంక్ వీడియోలు చేసే యూట్యూబ్ స్టార్ శ్రీ‌కాంత్ రెడ్డిపై కాకుండా అధికారులు క‌ల్యాణి ఇంటిపై దాడులు నిర్వ‌హించి సోదాలు చేస్తున్నారంటే.. ఇందులో ఏదో మ‌త‌ల‌బు ఉంద‌ని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక ఈ విష‌యంలో నిజానిజాలు త్వ‌ర‌లోనే తెలియ‌నున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now