Ira Khan : ఎంత ట్రోల్‌ చేసినా.. మళ్లీ ఆ ఫొటోలనే షేర్‌ చేస్తున్న అమీర్‌ఖాన్‌ కుమార్తె..!

May 15, 2022 5:08 PM

Ira Khan : సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో హీరోలు హీరోయిన్‌లే కాదు.. వారి పిల్లలు కూడా ట్రోలర్స్‌ బారిన పడుతున్నారు. ఇటీవలే జీవితా రాజశేఖర్‌ కుమార్తెలు దుబాయ్‌టూర్‌కు వెళ్లగా.. వారు ఎవరితోనే లేచిపోయారు.. అంటూ పుకార్లు పుట్టించి ట్రోల్‌ చేశారు. దీనిపై స్పందించిన జీవిత మాట్లాడుతూ ఏడ్చినంత పనిచేసింది. తమ ఫ్యామిలీపై తప్పుడు వార్తలు రాయొద్దని, వీడియోలు పెట్టవద్దని ఆమె విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ అలాంటి ట్రోల్స్, వార్తలు, వీడియోలు మాత్రం ఆగడం లేదు. ఇక బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ కుమార్తె ఇరా ఖాన్‌ కూడా ఈ మధ్య ట్రోలర్స్‌ బారిన పడింది. ఇరా ఖాన్‌ బర్త్‌ డే వేడుకలను జరుపుకోగా.. ఆ సమయంలో ఆమె బికినీ ధరించింది. దీంతో నెటిజన్లు భారీ ఎత్తున ఆమెను ట్రోల్‌ చేశారు.

ఒక అగ్ర హీరో కుమార్తెవి అయి ఉండి.. అందులోనూ తండ్రిని పక్కన పెట్టుకుని.. అది కూడా పుట్టిన రోజు నాడు అలా ఛండాలంగా బికినీ ధరించడం ఏంటి.. సిగ్గులేదా.. కాస్త మంచి దుస్తులు ధరించవచ్చు కదా.. అని నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేశారు. అయితే వాటిని ఆమె చూసింది కాబోలు.. ఆ బికినీ ఫొటోలకు తోడు మరిన్ని ఫొటోలను షేర్‌ చేసింది. ఆ వేడుకల సందర్భంగా తీసుకున్న ఇంకొన్ని ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేసింది. అంటే ఆమె ఆ ట్రోల్స్ ను చూసిందని.. కావాలనే నెటిజన్లకు స్ట్రాంగ్‌ రిప్లై ఇచ్చినట్లు ఉంటుందని.. అందుకనే ఆమె ఆ ఫొటోలను షేర్‌ చేసిందని.. స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే ఇరా ఖాన్‌ ఫొటోలు మళ్లీ వైరల్‌ అవుతున్నాయి. వాటిల్లో ఆమె అందాలను చూస్తే కుర్రకారుకు మతులు పోతున్నాయి.

Ira Khan befitting reply to netizen who troll her
Ira Khan

అయితే ఇరాఖాన్‌ను నెటిజన్లు టార్గెట్‌ చేయడం ఇది కొత్తేమీ కాదు. గతంలోనూ అనేక సార్లు ఆమె ఇలా ట్రోలర్స్‌ బారిన పడింది. కానీ ఈ మధ్య కాలంలో ఈమె ఏం చేసినా ట్రోల్స్‌ అధికంగా వస్తున్నాయి. మరోవైపు ఇరా తనకు ఆంగ్జయిటీ డిజార్డర్‌ ఉన్నట్లు గతంలో తెలిపింది. ఒక క్షణంలో మామూలుగానే ఉంటానని.. తరువాతి క్షణంలో ఆందోళనకు గురవుతానని.. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదని.. ఇరా తెలియజేసింది. ఇక ఇరాఖాన్‌ సినిమాల్లోకి రావడం లేదు. కానీ నుపుర్‌ శిఖారే అనే వ్యక్తితో ప్రేమాయం నడుపుతోంది. తన తండ్రి, బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఇటీవలే ఆమె బర్త్‌ డేను జరుపుకుంది. ఆ సందర్భంగా తీసిన ఫొటోలే వైరల్‌ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment